Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ జైశంకర్
జార్జ్‌టౌన్ (గయానా) : ప్రస్తుత కాలం యొక్క అవసరాలకు తగినట్లుగా భారత్-గయానా మధ్య సంబంధాలు ఏర్పాడుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సోమవారం భారత్ తయారు చేసిన ఫెర్రీ ఎంవి ఎంఎ లిషా ప్రారంభోత్సవంలో గయానా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీతో కలిసి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి జైశంకర్ ప్రసంగించారు. గయానా ప్రభుత్వంతో తన చర్చలు గురించి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాల ఉమ్మడి సంకల్పం గురించి కూడా భారతీయ సమాజానికి జైశంకర్ తెలియచేశారు. 'ప్రస్తుత కాలం యొక్క అవసరాలకు తగిన విధంగా సంబంధాలను మేం ఏర్పరుచుకుంటున్నాం' అని జైశంకర్ తెలిపారు. కాగా, ఆదివారం భారత్‌లో శిక్షణ పొందిన గయానా సివిల్ సర్వీసెస్ అధికారులతో జైశంకర్ భేటీ అయ్యారు. గయానా, పనామా, కొలంబియా, డొమికన్ రిపబ్లిక్ దేశాల కోసం తొమ్మిది రోజుల పర్యటనను జైశంకర్ ఈ నెల 20న ప్రారంభించిన సంగతి తెలిసిందే.