Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్సి ్టట్యూట్(సిప్రి) తయారుచేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం 2022లో ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ఐరోపా సైనిక వ్య యం 30 ఏండ్లలో ఎన్నడూ పెరగనంతగా పెరిగింది. ఇదే కాలంలో ప్రపంచ సైనిక వ్యయం 3.7శాతం పెరిగింది. దీని వాస్తవ విలువ 2.24ట్రిల్లియన్ డాలర్లు. గత సంవత్సరంలో ప్రపంచం మొత్తం చేసిన సైనిక వ్యయంలో అత్యంత సైనిక వ్యయం చేసిన మూడు దేశాల- అమెరికా, చైనా, రష్యా వాటా 56 శాతంగా ఉంది. వీటిలో అమెరికా చేస్తున్న సైనిక వ్యయం తన భౌగోళిక రాజకీయ ప్రత్యర్థులకు అంద నంత దూరంలో ఉంది. అమెరికా 877బిలియన్ డాలర్లు, చైనా 292 బిలియన్ డాలర్లు, రష్యా కేవలం 86.4 బిలియన్ డాలర్లు రక్షణ రంగంపై వెచ్చిస్తున్నాయని సిప్రి నివేదిక పేర్కొంది. అయితే అన్ని దేశాలకంటే ఎక్కువగా ఐరోపా సైనిక వ్యయం 13శాతం పెరిగింది. ఇది ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రేకెత్తిన భయాందోళనల వల్ల జరిగివుంటుందని సిప్రి నివేదిక అభిప్రాయపడింది. మధ్య, పశ్చిమ ఐరోపా దేశాల సైనిక వ్యయం 345బిలియన్లకు చేరింది. ఇది 1989 లో ప్రచ్చన్న యుద్ధం ముగిసేనాటికి చేసిన సైనిక వ్యయాన్ని మించిపోయింది. ఈ మధ్య కాలంలో చేసిన 2013నాటి సైనిక వ్యయంతో పోలిస్తే 2022లో 30 శాతం దాకా పెరి గింది. దేశాలవారీగా పెరిగిన సైనిక వ్యయాన్ని తీసుకుంటే ఫిన్లాండ్ 36శాతం, లిథ్యూనియా 27శాతం, స్వీడెన్ 12శాతం తమతమ సైనిక వ్యయాన్ని పెంచుకున్నాయి.
అమెరికా పెంచిన సైనిక వ్యయంలో గణనీయ భాగం ఉక్రెయిన్‌కు అందిస్తున్న ఆయుధ సరఫరా రూపంలో ఉంది. ప్రచ్చన్న యుద్ధం తరువాత గత సంవత్సరం అమెరికా ఉక్రెయిన్‌కు ఇచ్చిన 19.9బిలియన్ డాలర్ల సైనిక సహాయం మరేదేశానికీ ఇవ్వలేదు. అయితే అమెరికా మొత్తం సైనిక వ్యయంలో ఈ సహాయం వాటా కేవలం 2.3శాతం మాత్ర మేనని సిప్రి నివేదిక వివరించింది.
క్షీణిస్తున్న భద్రతా వాతావరణంలో, సమీప భవిష్యత్తు లో పరిస్థితులు మెరుగుపడవని భావించి దేశాలు తమతమ సైనిక సంపత్తిని పెంచుకుంటున్నాయి. దేశాల రక్షణ వ్యయం ఇలా పెరుగటం మనం భద్రతలేని ప్రపంచంలో బతుకుతున్నామనటానికి గుర్తు అని సిప్రిలో సీనియర్ పరిశోధకుడిగా పనిచేస్తున్న డాక్టర్ నన్ టియాన్ అన్నాడు.