Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను బచావత్
నేను బచావత్...
నాకేమి కాదు అనుకుంటే రుస్తుం..?!
నిన్ను సూడదు నన్ను సూడదు
నన్ను, నిన్ను కాచే ప్రభుతనే సూడదు
అర ఘడియలో వెయ్యో వంతు సాలు
మూతి ముక్కు కన్ను.. ఏడినుండైనా
గుసాయిస్తది, నిన్ను గుల్లజేస్తది
పైలమయ్య పైలము
హజార్ బార్ పైలము....!
మూతి బట్ట ఒట్టి పేల్క కాదు,
అది నీ ఏలిక
నీ బతుకుకే మేలిక...!
వస్త్రమనుకో, శస్త్రమనుకో
నీ అస్త్ర మనుకో..
కనబడని దుష్మన్ పైన అణ్వస్త్రమనుకో...
కడుపులో ఎవరో నలుగురు
చేయి పెట్టి తిప్పుతుంటరు
బకీటు బోర్లించినట్టు ఆగకుండా
పోతూనే ఉంటుంటే....
గుండెలోన గుదిబండలు
ఊపిరాడనియ్యని ఎగస్వాసలు
దూది ఊసినట్టు తెమడ...!
తెమడ తెమడలో..
కార్జమే బయటకొస్తుంటే...
దీనినే పున్నామ నరకమంటరేమో.
ఏమో...
ఎప్పుడూ ఎరుకలేదు...
ఇంత శరీర గోశ...!
నన్ను చీల్చుకుని నా బిడ్డలిద్దరు
ఎస్ఎంఎస్లు మనకు నేడు మంత్రము
శానిటైజర్, మాస్కులు, సోషల్ డిస్టెన్సులు
ఇవే శత్రువుపైన ఆయుధములు..!
పాణమెంత ఒలుస్తున్నా
నొప్పితో తొలుస్తున్నా
లోకమంతా చీకటనిపించినా
నీకు ఎవరూ కానరాకున్నా
జీవమే ఎగిరిపోతుందనిపించినా
నీకు తెలుసా నేస్తం....!
ఒక్కడుంటడు లోపల,
ఒక్కడుంటడు లోపల
వాడోక్కడుంటడు లోపల
మహా యోధుడు, వీరాధివీరుడు
నీ బక్క బలం తో పనిలేనోడు
జాగతమోనర్చు వాడిని
నిద్రలేపు వాడిని..
బాహుబలి వాడు, శతయోజనలు
దాటిన హనుమ వంటివాడు
వాడొక్కడు చాలు.. చాలు నేస్తమా
నిన్ను గట్టు కేస్తాడు,
ఏంటిబాడీగా మారి పోరాడుతాడు.
ఆత్మనిర్భరతనుకో
గుండెధైర్యమనుకో
బతుకు కై పోరాటమనుకో
సంకల్ప బలమనుకో
విల్ పవరనుకో, నీవు నమ్మిన దైవమనుకో
నీలోని నువ్వనుకో.
ఏదైనా అనుకో... వదలొద్దు వాడిని
అగ్గి రాజేస్తడు, నీలోని నిరాశను కాల్చేస్తడు
చూడు చూడు వాడిని, నీలో ఉన్న
నీవైన వాడిని, నీ ప్రతిరూపాన్ని
దిగాలు పడొద్దు అక్కా
హైబత్ తినొద్దు అన్నా
ధైర్యంగుండాలి, పోరాటమే మన పటిమ
విజేతలము మనము
గెలుద్దాము, గెలిపిద్దాము...! విశ్వమానవులందరం
గెలిచి చూపిద్దాము....!!!
- రమాదేవి కులకర్ణి
8985613123