Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దళితులు ఉన్నంతకాలం దళిత కవిత్వం, దళిత కథ, దళిత సాహిత్యం ఉంటుంది. ఎప్పటికప్పుడు చీల్చుకొస్తున్న దళిత సమస్యల్ని రికార్డ్ చేయడానికి ఏ కరీంనగర్ నుండో, ఏ ఖమ్మం నుండో మరే కారం చేడు నుండో సూర్యకిరణంలా అగ్గిరవ్వాలా ఒక సురికత్తి ఈనెల మీదకు పొడుసుకొస్తూనే ఉంటాడు. ఎక్కడ ఎవ్వరు ఎన్నెన్ని దుర్మార్గాలు చేసినా వాటిని ఎండగట్టేందుకు ఒక ఉపాలి ఎక్కడినుండైన పొడుచుకురావొచ్చు. నేను నాసిరకం గింజను కాను నేను వాసికెక్కిన దళితవాదాన్నని నిలబడే దలితుడేవరైన కులం వాసన కొట్టే ఈదేశంలో తలెత్తి మాట్లాడే ఇంకో సురికత్తి పదును నూరుకోవొచ్చు.
"Good poetry needs no explanation"
అంటారు W.B.Yeats.
ఇప్పుడు అర్ధరాత్రి అనబడు కలల సమయంలో, చెట్ల ఆకులమీనించి మంచు జారుడుబండ ఆడుతున్న ఒక రాత్రికాలపు నిశ్శబ్దంలోంచి, వెన్నెల రెమ్మలు మేఘాల కొంగులకు అనుకోని లాలిత్యంగా తన్మయత్వం చెందుతున్న ప్రకతి కీచులాటలో, ఒక్కసారిగా ఈ రాత్రి పుస్తకంలో మనసుపెట్టినప్పుడు అమాంతం దూకోచ్చాడు మహేంద్ర కట్కూరి సురికత్తి ఆయుధంతో. ప్రతినాయకుడ్ని పిడిగుద్దులు గుద్ధి మట్టి కరిపించగల ర్తీశీఅస్త్ర టవaర్ బ్రూస్లీలా.
మహేంద్ర కట్కూరి strong feast తో హదయాంతరాలల్లో ఎక్కడెక్కడో తగులుతున్నాడు. అలా అని ఇతను ఆయుధం యుద్ధం చేస్తుంది మనుషులమీద కాదు ఆయా మనుషులు గీస్తున్న కులపు వేర్పాటు గీతలపై. ఇతని ఆగ్రమే ఆలోచన.
యుద్ధమే శాంతి.పేజీ పేజీకి వాక్యానికి వాక్యానికి నడుమ ఇతను కార్చిన కన్నీరు ధారకట్టి ఆపై గడ్డకట్టి కవిత్వ రూపాన్ని సంతరించుకుంది. ఎడతెరిపి లేని దుఃఖం ఇతనిది. ఇతనూ అంటే అర్థం ఒక జాతి అని. ఒక సంసకుతని. ఒక వేధనని. ఒక దుఃఖమని. ఒక ధిక్కరరించే స్వరమని. ఒక మితిమీరిన ప్రేమని. ఒద్దురా.. ఈ కులాలు వద్దు. మతాలు వద్దు. ఈ ఏర్పాటు వాదాలొద్దు. కాస్థింత ప్రేమరా కావాలి.కాస్థంత న్యాయం రా కావాలి. నువ్వు ఎవరివైతే ఎంది. నువ్వు మనిషివేగా? నేను మనిషి నేగా.. మనిషిగా చూడండిరా.. అని
కొప్పుడుతున్నారు మహేంద్ర. దుఃఖ పడుతున్నారు కట్కూరి.
తెగ బలిసిన కొందరు అంటారు కదా అంతా సవ్యంగానే ఉందని.. ప్రేమకి అడ్డుతగిలే మరికొందరు నొక్కుతారు కదా.. కులాలు ఇంకా ఎక్కడవనినువ్వో మాదిగగా పుట్టి చూడు. మాలగా బతికి చూడు. ముస్లింగా ఉండి చూడు. బీసీగా నిలబడి చూడు. దుఃఖం ఏంటో, జీవించటం ఎంత కష్టమో తెలుస్తుంది. తల దువ్వుకుంటే ఓర్చలేవు. కొత్తబట్టలు ధరిస్తే తట్టుకోలేవు. కార్లు బంగ్లాలు సంపాధిస్తే సీత కన్ను వేస్తావు. సంకోచం నువ్వు. సహించుకోలేని ప్రేమించలేని తట్టుకోలేని called బ్రాహ్మణ భావాజాలంపై మహేంద్ర వేసిన కొత్త బాణం పేరు సురికత్తి.ముప్పయి కవితలున్న సురికత్తి కవితా సంపుటి ఒకానొక దుఃఖ కుంపటి. ఉటలా ఒచ్చి చేరుతున్న బ్రాహ్మనిజాన్ని మనువాదాన్ని,హైందవ సంస్కతిని ఆరేతో డప్పుతో తోలుతిత్తితో మాదిగ హదయంతో ప్రస్నిస్తున్నాడు.' మాదో కఠోర దీక్ష అంటున్నాడు' మాగళాన్ని కదిలిస్తున్నాం/ కలాలకు పదును పెడుతున్నాం/ మేధో బలాన్ని కలిపి దండోరాక్షరాలవుతామని మాదిగ జాతిలో వొచ్చిన మేధోపరమైన అభివద్ధితో సవాలు చేస్తూన్నాడు మహేంద్ర.
దళిత పోయెట్రీ అంటే పోర్న్ పోయెట్రీ అని, సుబార్డినేట్ పోయెట్రీ అని పెన్నువిరుచుకున్న సాహితీ మూర్ఖులకి ఇదిగో ఇది మాదిగ
లేదా దళిత సెన్సిబిలిటీ అని నిగర్వాంగా మాట్లాడుతుంది సురికత్తి
కవితా సంపుటి.తిట్టుకి, తిరుగుబాటుకు తేడా తెలియాల్చి ఉంది.
మనువు ముడుసుల్ని ఉడకబెడతాం/మతం తిత్తిదీసి మైసవ్వకాడ బెదురువెడతం/ మా మాదిగ జాతి చెప్పులు మీమెడలేసి/ దేశాల్ల ఊరేగించే మాదిగోపనిషత్త్/ అనే తిరుగుబాటుని ప్రకటిస్తున్నాడు. బౌతికంగా పైవాక్యాలు తిట్లులా గోచరించినా అవితిరుగుబాటుకి ఆగ్రహానికి సూచికలు. ఇదొక సిర్రాయణం. ఇదొక డప్పుభారతం. ఇంకా ఇదొక తిత్తి పురాణం. తునక వేదం. నలబై ఐదు డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్లో కోతలుకోసి శ్రమచేసే అగ్రవుల మానిఫెస్టో. ప్రకతితో మమేకమై శ్రమజీవుల థియరీ..సురికత్తి.
హంతకుడనే శీర్షికనున్న కవితలో మతాన్ని రాజకీయనాయకులు వాడుకుంటూ తప్పుటి చైతన్యాన్ని ప్రజలకి అందజేస్తూ, నీచ రాజకీయాల ప్రధర్శనని ప్రశ్నిస్తాడు. మతం గీతలతో కంచెలు నాటిన రోజులు చరిత్రలో కనుమరుగుజేసి/ మనమంతా ఒకటని మాయమాటలు పల్కుతుండు. కమలిజం చేస్తున్న హిందుత్వ దాడుల పట్ల తన జాతికి చైతన్యం కలిగిస్తున్నాడు. కమల కాషాయం పసరుపోసి మంత్రమేస్తుండు/ మత్తులోకి జారావా ఇక అంతమే. కాషాయ కసాయి సిద్ధాంతాన్ని బట్టబయలు చేసాడు.
మనం ఉండే తీరువేరైనా,మన గుండెతీరు ఒక్కటే అంటాడు మరో చోట. ఏ కవికైనా ఏ కవైనా చివరికి ఏమని చెప్తాడు? ఏమి కోరుకుంటాడు? తన చుట్టూ బిగించబడిన సంకుచిత భావాలకు రెక్కలిచ్చి, మనుషుల మధ్య చెల్లుబడి అవుతున్న నానారకల సమాజ రుగ్మతలకు చికిత్స చేస్తాడు.చేయాలి అని భావిస్తాడు.కులం ఒక మూఢ నమ్మకం.మతమొక బ్లాక్ మేజిక్ ఈ దేశంలో.మాదిగ అస్తిత్వ వేదనకు డిక్షనరీ సురికత్తి కవిత సంపుటి. భూగోళానికి చెప్పులు తొడిగిన చియ్యకారుల మోనోలాగ్ సురికత్తి.
ఒక తునక భాష,ఒక డప్పు సిర్ర కనకన శబ్దం, ఒక ముడుసు కుతకుత ఉడుకుతున్న దశ్యం, మాదిగ నర్సయ్యల కడుపులు చేస్తున్న లుకలుక ఆకలి ఆర్తనాదాలు, మాదిగ శ్రామికుల చమట వెదజల్లే సువాసన.అంబేద్కర్, పూలే, బుద్దుడు, ఎర్ర ఉపాలి ఇంకా మొత్తం మాదిగ జాతి ఆశయాలు ఆవేదనల గురించే మాట్లాడుతూనే, అగ్రకుల భావాజాలాన్ని, ఆధిపత్యాన్ని అన్యాయాల్ని అధికార దర్పంతో చేసే ఆగడాల్ని సజనాత్మకంగా వ్యక్తికరించిన కవితా సంపుటి సురికత్తి. అసలు సురికత్తి అని కవితా సంపుటికి శీర్షిక పెట్టడంలోనే మాదిగ జాతి తరతరాలుగా ఎంత శ్రమనుచేసి మరెంత చెమట ను కార్చిందో తేలికగా చెప్పేయొచ్చు.
చివరిగా దళితులు ఉన్నంతకాలం దళిత కవిత్వం, దళిత కథ, దళిత సాహిత్యం ఉంటుంది. ఎప్పటికప్పుడు చీల్చుకొస్తున్న దళిత సమస్యల్ని రికార్డ్ చేయడానికి ఏ కరీంనగర్ నుండో, ఏ ఖమ్మం నుండో మరే కారం చేడు నుండో సూర్యకిరణంలా అగ్గిరవ్వాలా ఒక సురికత్తి ఈనెల మీదకు పొడుసుకొస్తూనే ఉంటాడు. ఎక్కడ ఎవ్వరు ఎన్నెన్ని దుర్మార్గాలు చేసినా వాటిని ఎండగట్టేందుకు ఒక ఉపాలి ఎక్కడినుండైన పొడుచుకురావొచ్చు. నేను నాసిరకం గింజను కాను
నేను వాసికెక్కిన దళితవాదాన్నని నిలబడే దలితుడేవరైన కులం వాసన కొట్టే ఈదేశంలో తలెత్తి మాట్లాడే ఇంకో సురికత్తి పదును నూరుకోవొచ్చు. its a black culture poetry under white shadow with a neo aesthetic, linguistic structure.
- పెద్దన్న, 9866881140