Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్న పలుకరిచ్చిన మనిషి
ఇవ్వాళ లేడని తెలిస్తే గుండెంత కుంగిపోతది
బిడ్డపోతే ముట్టుకోలేం
తల్లిపోతే పిడికెడు మట్టెయ్యలేం
రెండు కన్నిటి చుక్కలు రాల్చుకోలేని కాలం
ఆఖరి చూపులులేని శ్మసనాలు
పాడుకాలం
ఊకెనే ఊసిపోతదనుకున్నరు పోలే
శక్తులు కూడదీసుకొని
పాకరై జారుతున్నది గాలై ఊడ్చేస్తున్నది
విచ్చలవిడితనాలో....
స్వెచ్చలకూ రెక్కలు మొలిపిస్తే
నెత్తిమీద నీడ చేతులెత్తేస్తే
నడింట్ల మత్యువు నాట్యం చేస్తున్నది
మనకూ
కరోనా భయమే
వ్యాక్సిన్ భయమే
మాస్క్ భయమే
శానీటైజర్ భయమే
అన్ని భయాలైనప్పడూ
మేడమీదికత్తి ''మేనమామదే''
దూరాలు చెరిగితే
బారాలు దగ్గరై కన్నీళ్ళు మూటగట్టిస్తున్నవి
ఎలిమెంట్ లేకుండనే
హీరోహౌండా నడుస్తున్నట్లు మాస్క్ లేకుండనే
వీధులు చెట్టాపట్టాల్ సభలు వీరంగాల్
చెట్టు అదుపులో కొమ్మలులేవు
కొమ్మల అదుపులో ఆకులులేవు
ఆకుల అదుపులో ఈనెలులేవు
ఎవరికీ వాళ్లు మీసాలు తిప్పుతుంటే
వైరస్ భూమి పయ్యంత నాకుతున్నది
- వనపట్ల సుబ్బయ్య, 9492765358