Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎద్దులను చింతచెట్టుకు ఒప్పజెప్పి
నెత్తిమీద కొట్టాన్ని బోర్లించుకున్న
పిల్లలకు పాఠంజెప్పేతందుకు
బలంతంగనైనా
సూపునంతా మునివేళ్ళలోకి పారిచ్చుకొని
షెవుల్ల నాగులపామసొంటి ఇయర్ ఫోన్ తగిలిచ్చుకొని
నాలుగు పుల్లల నెట్వర్క్ అంపశయ్య మీద
పిల్లల బవిషత్తును ఎలిగించి
అచ్చం బెదురుబొమ్మలా నిలవడి
ఆన్లైన్ల పాఠం జెప్తున్న
ఎదుటోనికి కష్టమొచ్చినప్పుడు
దాస్కునే అల్వాటులేనొల్లం
ఇప్పుడు దాస్కొని దాస్కొని
బతుకు ముచ్చట్లు జెప్పే కాలమొచ్చే
పిల్లల కండ్లకెల్లి సూసి
పాఠం జెప్తుంటే కడుపు నిండినట్లుంటుండె
నడ్మ నడ్మ ఎంకటేసు ఎచ్చరికాలకు
క్లాసురూంల పిల్లల మనసులు పువ్వులై ఇచ్చుకుంటుండె
అమాలిపనికెళ్ళి పాఠమింటున్నొళ్ళు
కల్లంల వరిగింజలై ఎండుతున్నొళ్ళు
టవర్ను నెత్తిమీద మోస్క తిర్గుతున్నొళ్ళు
''ఓ పొల్ల పోన్లనే మూతివెడ్తవ యిగ''
నాయినమ్మల శాపనార్తాలకు అలవాటైనొల్లు
మ్యాకల దొడ్డి తప్ప కూసోనింకె జాగలేనొల్ల సదువులు
క్వారంటైన్ అయితనే ఉన్నరు
గాజుగంపలకెల్లి సూషి
గిదంత వాట్ట్సప్ దినియనుకున్నం
ఇంకా సిగల్ అంటరాని ఏరియాలు
స్మాట్ ఫోన్ ముట్కోని తట్టషేతులున్నయని తెల్వకపాయె
గిది పాఠం
గిది దేశంలో పాదంలేనొల్ల బతుకుపాఠం
ఇగ జెప్పుదుమా సారు సదువు
- ఏ చందు శివన్న, 9963709032