Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నటి దాకా పచ్చదనం
పండిన పైరులా వున్న దేశం
నేడిలా నీరసించి నిట్టూర్పులతో
ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నది
సరదాలు సంతోషాలు సంబరాలు
గతకాలపు జ్ఞాపకాలుగా మిగిలి
నవ్వులు మాయమైన మనిషి
రేపటి గూర్చి ఊహించలేక
నిశ్చేష్టుడై మిగిలి పోయాడు
ఇల్లు, పిల్లలు, కన్న కలలు
చిందరవందరై తెలియని
తుఫానులో చిక్కిన నావికుడై
తీరం చేరే ఆశ కనిపించక
వెలుగు రాకకోసం నిరీక్షిస్తున్నాడు
రోజూవారీ లెక్కల్లో వేలల్లో చావులు
లక్షల్లోబాధితులతోఅంతుతేలకుంది
ఆసుపత్రులు, హాస్టళ్ళు, హౌటళ్ళు
కరోనా పీడితులతో నిండిపోయి
శవాలన్నీ స్మశాన వాటికలో క్యూలో దహన సంస్కార తంతుకోసం జాగరణ చేస్తున్నాయి
లేని మందులు,వాక్సిన్ ల కోసం
నిల్వలు కరిగిన ఆక్సీజన్ అందక జనం ప్రాణ భయంతో ఊపిరికై
విల విల్లాడుతూనే ఉన్నారు
ఓట్ల వేటలోఅధికార పీఠం కోసం
ఎన్నికల క్రీడలో మన ఘనాపాటి
నీరో ప్రభువులు మాత్రం తమ ఫిడేలు మత్యు రాగాలాపన
ఆపకుండా సాగుతూనే ఉన్నారు
- డా. కె. దివాకరాచారి
9391018972