Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటివరకు మానవ చరిత్రలో ఇంత భయానక పరిస్థితి ఏ దేశప్రజలు చూసి ఉండరు. కంటికి కనిపించని కరోనా ధాటికి అతలాకుతలమైంది యావత్ మానవ సమాజం. కడు బీదవారైనా రోజువారీ కూలీలు, వలస కూలీల దగ్గర నుంచి అత్యంత ధనికులైనవారూ, మానసిక శారీరక భయాందోళనలకు గురియైన కాలంగా 2020వ సంవత్సరం చరిత్ర పుటల్లో నిలుస్తుందనుటలో సందేహం లేదు. ఎంతో మంది మానసిక బలహీనులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. కొందరైతే బీదరికాన్నీ తట్టుకోలేక, సంసార భారాన్ని మోయలేక తనువుచాలించిన సంఘటనలెన్నో..
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది సామాజిక సేవకులు, డాక్టర్లూ, యాక్టర్స్ మానవతా దక్పథంతో కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకున్నారు. ఎంతో మంది కళాకారులు తమకళల ద్వారా మానసిక ధైర్యాన్ని అందించిన సందర్భాలెన్నో.... అందులో ముందు వరుసలో ఉన్న వాళ్లు కవులు, రచయితలు, గాయకులు రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజల్లో మానసిక ధైర్యాన్ని నింపారనటంలో సందేహం లేదు. కొన్ని వందలమంది కవులు, కవయిత్రులు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా కాలాన్ని తమ కవితల ద్వారా, దీర్ఘ కవితల ద్వారా, పాటల ద్వారా, వ్యాసాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి భయాందోళనకు గురికాకుండా చేశారు.
అటువంటి కవయిత్రుల కోవలోకి వచ్చే కవయిత్రి ప్రొఫెసర్ శరత్ జోత్స్నారాణి. ఆమె రాసిన దీర్ఘకవితే ''యుద్ధానికి అడుగులు వేద్దాం''. ప్రపంచ మానవాళిని అంతం చేయాలని అతిసూక్మ రూపంలో వచ్చిన కరోనాను అంతం చేయాలంటే ప్రపంచ మానవులంతా ఏకతాటిపై నిలబడి ఒక్కొక్కరు ఒక్కొ సైనికుకునిలా పోరాడాల్సిన అగత్యాన్ని తన దీర్ఘ కవిత్వం ద్వారా జోత్స్నారాణి చాలా స్పష్టమైన పదాలతో ఎక్కడ అస్పష్టత, సంక్లిష్టత లేకుండా సులభమైన శైలిలో చదువరులకు చదవగానే అర్థం అయ్యేరీతిలో రాయడంలో కతకత్యులయ్యారు. కవయిత్రి ఎంతో మానసిక ఆవేదనచెందితే తప్ప ఇటువంటి ప్రపంచాన్ని పట్టి పీడించిన ఇంకా పీడిస్తున్న ఎన్నో రకరకాల సామాజిక సమస్య మీద ఇంత పదునైన, బలమైన ఆలోచనను రేకేత్తించే నిబద్ధ కవిత్వం రాయలేరు. తనలోని ఆవేదనను, కవిత్వ ఆవేశాన్ని కోకిలద్వారా ఉపదేశించడం బాగుంది.
అంతేకాకుండా సమాజంలోని రకకాల సామాన్య వ్యక్తుల నుంచి ఫిల్మ్ స్టార్స్, రాజకీయ నాయకులు పోలీసులు అందరూ కరోనాను కట్టడి చేయడంలో ఎలా ముందున్నారో చాలా సునిశితంగా పరీశీలించి రాసినకవిత్వంగా ఈ లాంగ్ పోయెమ్ ను గమనించవచ్చు
ఈ దీర్ఘకవితకు ముందుమాట రాసిన ప్రొఫెసర్ టి. గౌరీశంకర్ గారు కవయిత్రి స్త్రీ సహజమైన సౌకుమార్యంతో, సున్నితంగా కరోనాను ఉద్దేశించి ఒక హితోపాదేశం, ఒక గీతోపదేశం చేస్తూ కాలస్పహతో అద్భుతమైన కవిత్వాంశ కలిగిన కవిత్వం రాశారని కొనియాడారు. కవయిత్రి ఈ దీర్ఘకవితకు నేపథ్యాన్ని చెపుతూ ఇలా రాసుకుంది తన మనసులో మాటలో ''నేను ఏ అంశంపై నైనా స్పందిస్తే కవిత్వం రాస్తాను. అలాగే ఈ కరోనా నా మనసుపై ప్రభావం చూపించింది. అందువల్ల రాయగలిగాననుకుంటున్నాను''
ఇప్పటికే ఈ దీర్ఘకవితను హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ జె. భీమయ్య ఆంగ్లంలోకి ''ుష్ట్రవ దీa్‌్‌శ్రీవ Aస్త్రaఱఅర్ ుష్ట్రవ జశీఙఱస-19'' (A ూశీఅస్త్ర ూశీవఎ శీఅ ్‌ష్ట్రవ జశీతీశీఅa ఙఱతీబర) అనే పేరుతో అద్భుతంగా అనువాదం చేశారు. నేను ముందుగా ఆ అనువాదమే చదివాను. ఆ అనువాదం చడవటం వల్లనే మూల రచనను చడవడాని ప్రేరణ అయ్యింది. ఆ ప్రేరణతోనే ఆ కవిత్వం నచ్చి నేను ఈ వ్యాసం రాయడం జరిగింది.
మనుషులు రోజురోజుకు మానవత్వాన్ని మర్చిపోయి వ్యక్తిగత స్వార్థంతో యంత్రాలుగా మారి తమ ఉనికినే కోల్పోతున్న సందర్భంలో ఇలాంటి ప్రకతి వైపరీత్యాలు సంభవిస్తాయేమోనని ఈ కవయిత్రి ఇలా వాపోతుంది :
మానవత్వం నశించిన
మానవాళిని గమనించిందేమో!
ఒక్కసారిగా కరోనా కోరలు తెరచి
కాటువేస్తుంది కాబోలు!
అందుకే మనమంతా కలిసి
నగరంలో పరిశుభ్రతను పాటిద్దాం!
మౌనంగా బతుకమ్మను మొక్కుకుందాం
మానవాళి క్షేమం కోసం
అందరం కలిసి
యుద్ధానికి అడుగులు వేద్దాం....
కరోనా సర్పాన్ని మట్టుబెట్టాలంటే మనందరిముందున్న ఒకే ఒక్క ఆయుధం పరిశుభ్రత. అందుకే శుభ్రతను పాటిస్తూ అందరూ సైనికుల్లా పోరాడాలని పై కవితా పాదాలద్వారా కవితాత్మకంగా చెబుతున్నారు కవయిత్రి. ఇప్పటికిప్పుడు మన ముందున్న ఇరుగుడు మందు కారోనాను జయించాలంటే చేతుల్ని శుబ్రంగా కడుక్కోవడం, సానిటైజ్ చేసుకోవడం సామాజిక దూరం పాటించడం. సమాజ దూరానికి కొంతమంది పెదార్ధాలు తీస్తున్న తీరును, కవయిత్రి ఇలా అంటుంది.
'దూరం' అనే పదం వింటే చాలు
నా మనస్సు గతచరిత్రలోకి
అడుగుపెడుతుంది.
యుగయుగాల నుండి సమాజంలో ఆర్థికంగా బలమైన వర్గాలు బాహీనమైన వర్గాల్ని ఎలా దోచుకున్నారో... వాళ్లతో ఎలా చాకిరి చేపించుకొని సభ్యసమాజానికి దూరంగా నెట్టివేశారో.. ఇప్పటికి అదే తరహా పదాల్ని వాడటం మూలాన చాలా మంది కింది వర్గాల వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకే కొంతమంది సామాజిక కార్యకర్తలు 'సోషల్ డిస్టెన్స్' అనే పదాన్ని మార్చి 'ఫిజికల్ డిస్టెన్స్' అనే పదాన్ని కాయిన్ చేశారు.
లాక్డౌన్ వల్ల ప్రజలకు నష్టమే కాకుండా కొన్ని లాభాలు కూడా జరిగాయి. కొంత కాలం కుటుంబ సభ్యులంతా ఇళ్లల్లో కలిసి మెలిసి ఉండటం, రోడ్లమీద యాక్సిడెంట్స్ తగ్గడం, నగరాల్లో కాలుష్యం తగ్గడం... మనుషుల్లో కొంత మానవత్వ విలువలు పెరగడం.. కరోనా సమయంలో జరిగిన మంచి పరిణామాలుగా చెప్పుకోవచ్చు.
కరోనా కాలంలో వలస కూలీలు, రకరకాల వత్తిని చేసుకుంటూ కుటుంబానికి దూరమై ఎక్కడెక్కడో చిక్కుకు పోయినవారిని తమ సొంతూళ్లకు చేర్చిన అభినవ కర్ణుడు సోనూ సూద్ గురించి, అదే విధంగా కష్టాల్లో ఉన్న ఎంతో మందికి సహాయం చేసిన రాజకీయ నాయకులను ఫిల్మ్ యాక్టర్స్ దాన గుణాన్ని, త్యాగశీలతను తన కవిత్వంలో పేరుపేరునా కొనియాడారు.
మనిషి మంచిని పెంపొందించుకుంటూ ప్రాంతమేదయినా, దేశమేదయినా, మనిషిగా బతకాలి. వత్తి ఏదయినా, ప్రవత్తి యేదయినా, కలహాల్ని మానుకొని కలిసి జీవించడం నేర్చుకోవాలి. అందుకే ఈ దీర్ఘ కవితను కవయిత్రి ఆచార్య జోత్స్నారాణి చివరిగా జీవితాన్ని ఎలా జీవించాలో చాలా తాత్వికత నిండిన వాక్యాలతో ముగిస్తుంది:
ఓ మనిషి! మనసుతో ఆలోచించు
కాలంతో పుట్టిన మనిషి
కాలం చేయక తప్పదు
.................
జీవితం మాయ అని
జీవితమొక జూదమని
కన్నుమూసి తెరిచేలోగా
ఏమి ఉండదని తెలుసుకో!
అందుకే
మానవత్వపుసిరులతో
మనుగడ సాగించు!
జీవితం గురించి ఎంతోమంది కవులు, కళాకారులు, రచయితలు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఈ కవయిత్రి చివరి వాక్యాలు చదువుతుంటే నాకు షేక్స్పియర్ వీaషbవ్ష్ట్ర నాటకంలోని కథానాయకుడైన వీaషbవ్ష్ట్ర విప్పిచెప్పిన గొప్ప తాత్విక వాక్యాలు గుర్తుకోచ్చాయి.
ూఱటవ ఱర a ్aశ్రీవ ్శీశ్రీస by aఅ ఱసఱశ్ీ
టబశ్రీశ్రీ శీట రశీబఅస aఅస టబతీy రఱస్త్రఅఱళవర అశ్ీష్ట్రఱఅస్త్రౌౌ
- డాక్టర్ బాణాల శ్రీనివాసరావు