Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొడిచిన అందాలొలుకుతొలిపొద్దు
అంతలోనే మునిమాపై
మహాచీకట్లకు మరుగుతుంది
శీతాకాలం ఉదయపు చలివెలుగులు కాస్త
వేసవి మార్తాండుడి మధ్యాహ్నపు మండుటెండై నిప్పులు చెరుగుతుంది
హాయిగొల్పి మనసుదోచే మహాగానం
లయతప్పి మా ప్రాణం తీయతాకుతుంది
పురివిప్పిన తురాయి మహావనం
పుడమి మీన అరుణతారై ఆకాశంకేసి నిరసనచూపుగా ఎగబాకుతుంది
లతలా సాగి పూసిన మమతల మల్లెమాను
చీడపీడలు మొదలతగిలి దిగులుమొదలై రగలి మల్లె పరిమళం మరిచిపోతుంది లేతసోయగాల అందాల ఆమనితరువు విరులవిరిసి ఇంతలోనే
శిశిరమై శిధిలమై నేల ఒడిని చేరుతుంది
అలలపెదిమల గలగలల కదలాడే
నా పెదవాగు నీరం
మహాపాపం తగిలి పొగిలి
ఘనీభవించి మూగదవుతుంది
కోటి రాగాలు పలికే
రత్నమణిమయ ఖచిత రుద్రవీణ
తీగతెగి పాడుబడి పాటరాగం పలకని
మౌన నిద్ర వీణీయవుతుంది
కొండాలోయల్లో అడవి హత్తీరంలో ఊయలలూగే గాలికెరటం
తోట, కోటల్ని విడిచి, కడలి తీరం మరచి గుండెలిడిస్తూ ప్రతిధ్వనిస్తుంది
ఆవిరి మేఘాల సితమందస్మిత అందాల శీతల గాలులతో అలరారు ఆ నీలి ఆకాశం
ఉరుములై పిడుగులై ఎదదగ్దమై ఆకాశం అణువణువునా దహిస్తుంది.
- నల్లగొండ
సెల్ : 8309462179