Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొత్తం నీ బలగాలు, సమస్త యోధులు
మొత్తం నీ యుద్ధ ట్యాంకులు
నీ యావత్ సైన్యమూ..
రాయి చేత పట్టుకు నిలిచిన ఒకేఒక్క ఒంటరి
బాలునికి విరుద్ధంగా..!
ఆ పసి కళ్ళలో నేను సూర్యుణ్ణి చూస్తున్నాను.
ఆ మిసిమి నవ్వుల్లో నాకు చంద్రుడు కనిపిస్తున్నాడు!
నాకు ఆశ్చర్యంగా ఉంది.
అత్యంత ఆశ్చర్యంగా ఉంది.
ఎవరు బలహీనులు?
ఎవరు బలవంతులు?
ఎవరిది న్యాయం?
ఎవరి దన్యాయం?
నా ఆశ ఒకటే.., ఒకేఒక్కటి..
సత్యం నోరువిప్పుతుంది.
- మూలం : మహమ్మద్ జెయార
అనువాదం : మడిపల్లి రాజ్‌కుమార్