Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టికిప్పుడు స్వాతంత్య్రం లేదు
ప్రపంచ అడవి పందులు దాడిలో
క్షతగాత్ర అయింది.
మట్టిలో ఇప్పుడు విత్తనాలు మొలవడం లేదు
ప్రపంచ బేరాల చెక్ బుక్కలు మొలుస్తున్నాయి
మట్టికిప్పుడు ఇంటి గస్తీతో బాటు
ప్రపంచ గస్తీ మొదలు
దోపిడి కొత్త పుంతలు తొక్కి
నాగలికి కర్ఫ్యూ చక్రబంధం
మౌనంగా దు:ఖిస్తున్న మట్టి
కుహనా ప్రగతి ఫార్ములాకు బలి
మౌనంగా ఉండకపోతే ''వెలే'' అంటుంది ఫర్మానా
ఆరోగ్య సస్యానికి విత్తనాలు లేవు
ఖజానాలు నింపే బిర్యానీ విత్తనాలే
పాలన గ్రీష్మం దుర్నిరీక్ష్యమై
సేద్యం చిరునామా కేరాఫ్ ప్రపంచీకరణ
సంక్షేమ నదులు ఎండిపోయినయి
కైంకర్య చెలిమెలు పుట్టుకొచ్చి
పొలాలు వట్టిపోయినయి
ఇప్పుడు మట్టిలో విత్తనాలు మొలవడం లేదు
డబ్బు ఎగుమతి మొదలైంది
ప్రపంచ కార్పొరేటు బీమా వ్యాపారం షురవయింది
బిక్షా మహా ప్రస్థానం చేస్తున్నది
ప్రపంచీకరణ లేజరు చికిత్సలో
చెమట లెన్నేసిన చెరుకుగడ
ఇప్పుడు మట్టిలో బతుకు వ్తినాలు మొలవడం లేదు
ఇప్పుడది కోటీశ్వరుల బంగారు బాతు
మట్టి మళ్ళీ మట్టిగా మారాలంటే
మట్టి పిడికిళ్ళ రేడియో ధార్మికత కురవాలి
- వల్లభాపురం జనార్థన
సెల్: 9440163687