Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1. ఏం మాట్లాడలేదు
అతిథి, ఆతిథ్యమిచ్చిన వాడూ -
తెల్ల చామంతులు
- ఒషిమ ర్యొత, (1718 - 1787)
2. ఒక పువ్వు పక్కనున్న పువ్వుని
పోటీదారని అనుకోదు.
అది పూస్తుందంతే -
- ఝెంక షిబయమ (1894 - 1974)
3. నా దగ్గర ఏమీ లేదు -
కానీ ఈ పరవశత్వం..
ఈ శీతలత్వం..
- కొబయషి ఇస్స (1763 - 1828)
4. సముద్రపు చేపలు,పువ్వులు
గ్రామస్తులకు లేకపోవచ్చు -
కానీ ఈ రోజుటి చంద్రుడున్నాడు.
- ఇషర సైకకు (1642 - 1693)
5. ఒట్టి ఒంటరితనం -
శిశిర సందెచీకటిలో
మరో మహదానందం
- యెస బుసొన్ (1716 - 1784)
6. శరత్కాల సాయంత్రం -
ఆమె వచ్చి అడిగింది ''ఇదే సమయం కదూ..''
''లాంతరు వెలిగించడానికి..?''
- ఒచి ఎత్సుజిన్ (1656 - 1739)
7. నా ధాన్యం గాదె కాలిపోయింది - నాకూ చంద్రునికి మధ్య
ఇప్పడెవరూ లేరు.
- మిఝుత మసహిడె (1657 - 1723)
8. కాదు కాదు -
చెర్రీ పూవులు కూడా
ఈ రోజు శశికి సమానం కాలేవు.
- నిషియమ సొయిన్
(1605 - 1682)
9. అంతటా ప్రశాంతత-
భూమి అర్థ నిమీలిత నేత్రాలతో
శీతలంలోకి ప్రవేశిస్తోంది.
- డకొత్సు ఇద (1885-1962)
10. మంచు
మంచు మీద పడుతోంది -
మిగిలింది మౌనం.
- తనెద సంతొక (1882 - 1940)
- అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్