Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో 16 జూన్ 2021న నిర్వహించనున్న 'ALL INDIA YOUNG WRITER’S MEET Webline Literature seriesలో భాగంగా దేశంలోని గుర్తించిన 24 భాషలకు చెందిన యువ కవవులు/ రచయితలను ఎంపిక చేశారు. 'తెలుగు' భాష ప్రతినిధిగా 'బండారి రాజ్‌కుమార్' పాల్గొననున్నారు. ఆయన వరంగల్ రూరల్ జిల్లా 'పాతమగ్థుంపురం' గ్రామస్తులు. గరికపోస, నిప్పు మెరికెలు, గోస, వెలుతురు గబ్బిలం 4 వచన కవిత్వ సంపుటులు వెలువరించారు. ఆయన ఎంపిక పట్ల పలువురు సాహితీవేత్తలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.