Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుము - మెరుపులూడి
గుండెలో పిడుగుసూలాలై దిగవడ్డా
పిసరంత దిగుల్నిగూడా దాపులరానీయని
నైజంమీనే కదా నువ్వు దర్జాగా గూసున్నది
పొట్టజీల్చి రివ్వున దూస్కచ్చిన
సునామిగద్ద,దాని దంటుగాని దాదాగిరులకు
ఎదలో ఈసమెత్తు నిరాసగ్గూడా సోటీయ్యని
దైర్నంమీనేకదా.. నువు నిల్సున్నది
కూసాల్ని కుల్లబొడ్సే బద్మాస్ కంపనాల్ని ,
కాయాన్ని బుగ్గిజేసే ! లావా లూటీల్ని
కావలించుకున్న నిబ్బరపుసిర్నవ్వు
మీనేకదా నువు గూడు గట్టుకున్నది
హరికేన్లు-తూఫాన్లూ సాంతం
ఊడ్సుకెల్లినా.. సింతనేనాడు
కంటిసెమ్మగానైనా పిగల్నివ్వని,గీ ఇమ్మత్
మీనేగా నువు ఆరామ్‌గా పండుకున్నది
అరె ! ధీమా అమ్మని సంకలవెట్టుకొని
దమాక్ లేనోడిలా గీదినం దునియాని
జూసి, ఒకటే .. మనాదివెట్టుకున్నవు,
లే ! ఇగనైనా సొచ్చెతాసుతితో ఇంటిపట్టునే
దిల్ ని దిలాసా గుర్రంమీన సవారి జేయించు.
- కష్ణ గుగులోత్
సెల్ : 9618096173