Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకింత శబ్దమూ
మరొకింత నిశబ్దమూ
కళ్ళు తెరిచి చూస్తానా
వెల్తురులో శబ్దం నత్యం చెస్తుంది
కళ్ళు మూసుకుంటానా
లోపల చీకట్లొ
నిశబ్దం తాండవం చేస్తుంది
సంకోచ వ్యాకోచాలు తప్పవు
హ్రుదయ లోలకం
ముందుకొ వెనక్కో
వూగక తప్పదు
బతుకంటే నే అంత
తోడు నడవాలి
తోడు తచ్చు కోవాలి
కలిసి నడవాలి
అడుగుల్లో అడుగు లేసి నడించాలి
అయినా అప్పుడప్పుడూ
సన్న గాలికో
చిన్న వాలుకో
దీపం గజ గజ వణికి పోతుంది
తెరచాపలా వణికేది దీపమే అయినా
నీడలు అలల్లా డుతాయి
బతుకు విలవిల్లాడుతుంది
అవును
బతుకంటెనే అంత
- వారాల ఆనంద్