Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్లెపుట్టి మట్లెపెరిగి
మట్టిని సుట్టకుదురుగ చేస్కొని
ఒదిగి ఉన్నందుకేమో
నీకు నిలువెల్లా మట్టితనమబ్బింది
సాలుసాలుకు సాలెళ్ళ
మట్టికుండై తిరుగాడినందుకేమో
నీ పెయ్యి దినాం చెమ్మటిత్తది
ఓటుపోయేదాన్క కొల్త కుండై
గాసం కొలువాలన్నదే ఆశ
వట్టిపోయేదాన్క బోనమై
కడుపులు నింపాలన్నదే జాస
వామిల కాలినట్టు
ఎండకు వరుగు వరుగైనా
సల్లకుండై సలువ పంచుడే ఎరుక
ఆదరించినా ఆదరించకున్నా
తొణుకవు బెణుకవు
నువ్వు నిండుకుండ రూపు.
- దయాకర్ వడ్లకొండ,
9440427968,