Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారం అడవిని కాల్చేస్తుంటే
అడ్డుపడ్డ చేతులు నీవి
దౌర్జన్యం దర్జాగా జరుగుతున్న రోజుల్లో
ఎదురు నిలబడి గర్జించే స్వరం నీది
అన్యాయం నిత్య వసంతమైనా చోట
ప్రశ్నించేతత్వపు పలుకుబడి నీది
నిర్బంధం చుట్టుముట్టిన చోట
నిశ్శబ్ద విప్లవాల పిడికిలి నీది
అన్నా...నీకోసం నువ్వు నిలబడకుండా
నలుగురి కోసం నడిచినప్పుడే నువ్వు అమరుడివయ్యావు
నగమైన భౌతిక వాస్తవాలతో నువ్వు ఎన్ని సార్లు మరణించి ఉంటావో
ఇప్పుడు ఈ మరణంలో ఓ లెక్క నీకు
రాలుతున్న కన్నీళ్ళన్నీ ఉట్టి కల్పితమే
ఎందుకంటే వాటికి ముందే తెలుసు
నేటి అస్తమయం రేపటి ఆశతోనే నిద్రిస్తుందని
అయినా మై డియర్ కామ్రేడ్
నువ్వు నిలువెత్తు నినాదాల విప్లవానివి కదా
నా పిచ్చి కాకపోతే విప్లవానికి వీలునామాలు ఉంటాయా
నినాదాలకు నిలువెల్లా ఊపిరి పోసిన వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు మిగిలే ఉంటాయి కదా
అందుకే ఇదే అడవిలో
అమరత్వపు శిఖరాల మీద
నీ నినాదాలు జెండా
మా గుండెలను తాకుతూనే ఉంటుంది
అన్యాయం జరిగే చోట దిక్కారామే మా దిశ అని గుర్తూచేస్తూ...
- పి.సుష్మ
మక్తల్, 9959705519