Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలోచనల కాసారంలో
లోచనాలను వెతుక్కునేలోపు
జరగవలసిన నష్టం జరుగుతుంది
మనోనేత్రం పదునుగావుంటే చాలు కదా
మనలోకం మనదే అనుకోకుండా
చుట్టూ సంభవించే పరిణామాలు
గమనించకపోతే యెలా
తాలిబన్ల తాలింపు మాడువాసన
ముక్కుకు సోకటంలేదా
హాహాకారాలు చెవికి తగలటంలేదా
మౌనం వహిస్తే యెలా
లోకా సమస్తా సుఖినో భవతు
అనే నీ సంస్కారమేమైంది?
తలిబన్ మదాంధుల చెంప పగిలే
గుణపాఠం నీ చేతులోనేవుంది, చేతలలోనేవుంది.
ఇన్నాళ్ళు పెంచిపోషించిన
అమెరికా పెదవి కదపటంలేదంటే
వైనం యేమితో యింకా బోధ పడలేదా
పీడితజనం కోసం
సంఘిటిత ఉద్యమం చేయాలికదా
అజండాలు, జెండాలు కాదు
ఆ పొగరుమోతుల దందానంతంచేయాలంటే
సంఘీభావంతో పాటు జన సమరంలో
మన కనీస తోడ్పాటు అనివార్యం
ఏ రూపంలోనైనా సరే అందించాల్సిందే
- కపిల రాంకుమార్ , 9849535033