Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి సాహితీ పురస్కా రాలను ప్రకటించింది. పద్యకవితా ప్రక్రియలో మొవ్వ వషాద్రిపతి 'శ్రీ కష్ణదేవరాయ విజయ ప్రబంధము', వచన కవితా ప్రక్రియలో కాంచనపల్లి గోవర్ధన్ రాజు 'కల ఇంకా మిగిలే ఉంది', బాలసాహిత్యంలో సామలేటి లింగమూర్తి 'పాటల పల్లకి', కథానికా ప్రక్రియలో ఏరావులపాటి సీతారాం రావు 'ఖాకీకలం', నవలా ప్రక్రియలో డా|| గడ్డం మోహన్ రావు 'కొంగవాలు కత్తి', సాహిత్య విమర్శలో డా|| కిన్నెర శ్రీదేవి 'సీమకథ అస్తిత్వం', 'నాటకం / నాటికల్లో ఎన్.ఎస్.నారాయణబాబు 'అశ్శరభ శరభ', అనువాదంలో కె.సజయ 'అశుద్ధ భారత్', వచన రచనల విభాగంలో లక్ష్మణరావు పతంగే 'హైదరాబాదు నుంచి తెలంగాణ దాక', రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో సమ్మెట ఉమాదేవి 'రేలపూలు' గ్రంథాలు సాహితీ పురస్కారానికి ఎంపిక య్యాయని విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు తెలియజేశారు. ఈనెల 29న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక ఉత్సవంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారంగా ఒక్కొక్కరికి 20,116/- రూపాయల నగదు అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు.