Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవితను చదివినవాళ్లలో చాలా మందికి ఇందులో విశేషం ఉన్నట్టు వెంటనే తెలియదు. కానీ ఈ కవి దీన్ని ఎంతో చాతుర్యంతో రాశాడు. ముందు చెప్పిన విశేషాన్ని తొలగిస్తే ఈ కవితలో గొప్పతనమేముంది?! దాచిపెట్టిన విషయం వలననే ఈ కవితకు ప్రత్యేకత, విలువ చేకూరాయి. కవిత్వంలో ఖాళీలకు వేరే ఉదాహరణలు ఉండవచ్చు గాని (వీటిని white spaces అంటారు), ఇందులోనిది కూడా ఒక రకమైన ఖాళీయే అని చెప్పవచ్చు.
కొన్ని కవితలు మనసును తట్టేవిగా ఉంటే, మరికొన్ని మెద డుకు పని పెట్టేవిగా ఉంటాయి. ఈ కింది కవితలో చెప్పకుండా దాచింది (unsaid or untold thing) ఏదైనా ఉన్నదా? పరిశీలించండి. ఒకవేళ అటువంటిది మీకు స్ఫురిస్తే, కవిత్వంలో కొన్నిసార్లు ఉండొచ్చునని చెప్పబడే ఖాళీ(gap in poetry) అది. ఈ కవితను చదివినవాళ్లలో చాలా మందికి ఇందులో విశేషం ఉన్నట్టు వెంటనే తెలియదు. కానీ ఈ కవి దీన్ని ఎంతో చాతుర్యంతో రాశాడు. ముందు చెప్పిన విశేషాన్ని తొలగిస్తే ఈ కవితలో గొప్పతనమేముంది?! దాచిపెట్టిన విషయం వలననే ఈ కవితకు ప్రత్యేకత, విలువ చేకూరాయి. కవిత్వంలో ఖాళీలకు వేరే ఉదాహరణలు ఉండవచ్చు గాని (వీటిని white spaces అంటారు), ఇందులోనిది కూడా ఒక రకమైన ఖాళీయే అని చెప్పవచ్చు. పైకి మామూలుగా కనిపించే ఇట్లాంటి కవితలలోని అసలైన అర్థాన్ని గ్రహించాలంటే reading between the lines రావాలి. అయితే, అది రాకపోవడం వలన ఇటువంటి కవితలను అనువదించడంలో అడ్డంకి ఏర్పడదు. మూలంలోని పదాల, phraseల, అభివ్యక్తుల, లేదా జాతీయాల అర్థం తెలియనప్పుడు మాత్రం అనువాదంలో అవరోధం నెలకొంటుంది.
స్పానిష్ రచయిత, Cervantes రాసిన Don Quixote(డాన్ కిహోటె/దోఁ కిహోతె) అనే నవలలో నర్మగర్భంగా సూచితమైన anti-heroism లాంటిది ఈ కవితలో ఉన్నదేమో అనిపిస్తున్నది. చెప్పకుండా దాచినదాని వలన తలెత్తిన అనిశ్చితి ఒక రకమైన అందానికి దారి తీసిందని కూడా తోచవచ్చు కొందరికి. అనిశ్చితి గురించి ఆలోచించి అసలు విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించడం కంటె, అందాన్ని ఆస్వాదించడమే ముఖ్యం అవుతుంది కొందరికి. ఈ కోణం లోంచి పరిశీలిస్తే ఇందులో ఉన్నదాన్ని ఏమనవచ్చు? జాన్ కీట్స్ చెప్పిన negative capability అనవచ్చునా?
ఆంగ్లానువాదంలోని form నే (రూపాన్నే) తెలుగు అనువాదంలో తేవడానికి ప్రయత్నించాను. చదవండి.
హోపోన్ బాబు, మిస్టర్ మూషిక్
మిస్టర్ మూషిక్
చాలా దుడుకు పిల్లవాడు
గోడకు చేరగిలబడి
కూచున్నాడక్కడ వాడు
మిస్టర్ మూషిక్ ను పట్టుకోవాలని
ప్రయత్నించాడు హోపోన్ బాబు
కాని, అది చెప్పనలవి గాని
కష్టంతో కూడుకున్న పని!
ఎందుకంటే మిస్టర్ మూషిక్
అన్నిటినీ కొరికేస్తాడు,
వాటి ముక్కల్ని వదిలి
క్షణంలో అదృశ్యమౌతాడు
ఈ ఎలుకతో పడ్డాను బాధలెన్నో
ఇక దీన్ని బాదేస్తాను ఇవాళ నేను
అంటూ వెదురు కర్రనొకదాన్ని
పట్టుకున్నాడు హోపోన్ బాబు
కానీ మన హోపోన్ బాబు జాలి గలవాడు
చిన్ని ఎలుకను కర్రతో కొట్టడమా?
ఆ పని చేయడతడు
మిస్టర్ మూషిక్ కోసం
గోడ దగ్గర ఊకా గట్రా
పరిచాడు హోపోన్ బాబు
వారి కొట్లాట ఆగింది
అది ఈ విధంగా ముగిసింది:
మిస్టర్ మూషిక్, హోపోన్ బాబు
ఇప్పుడు పరస్పరం మంచి మిత్రులు
సంతాలీ మూలం: రూప్ చంద్ హంస్డా
ఆంగ్లం: హంస్డా సౌమేంద్ర శేఖర్
- ఎలనాగ ,9866945424