Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మురిసి ముక్కలౌదాంఅభివద్ధి వెలుగులు ప్రవహిస్తున్న చోట
దేహాలు కాలుతున్న కమురు వాసన
సాయంత్రానికి వస్తాడని
ఎదురుచూసిన తల్లి కళ్ళలో
ఆత్మాహుతి చేసుకున్న కొడుకు మంటలనీడ
సమూహాలుగా విడిపోయిన చరిత్రకి
నోళ్లే కదా మంటలు రాజేసింది
నువ్వొక మాట
నేనొక మాట
ఇద్దరం కలిసే కదా సరిహద్దుల
నాలుకల మీద తిట్ల దండకాల
నత్యాలు చేయించింది
కళ వెనక దాక్కోవడమూ కళే...!
తెలియని తనం ఏమి లేదు
ఉనికి కోసం ఉత్త వెంపర్లాట
కాలం కూడా గాయం చేసిన వాడినే సమర్ధిస్తుంది
అప్పటిదాకా యుద్దాలు చేసిన చేతులే శాంతి సందేశాలు రాస్తాయి
హదయం వెనక తీపి లేకపోయినా
పెదవులు మాత్రం చిరునవ్వులుచిందిస్తాయి
నటన కూసు విద్య
కౌగిలించుకున్న రెండు అబద్దాల మధ్యలో రెండు కత్తుల కరచాలనం
ఏనాడు కలవని రెండు రెక్కల పిట్టలు
ఒకే సమాంతర రేఖ మీద కువకువలాట
చుట్టూ మూగిన మార్కెట్ బ్రాండ్ల మాయలో
గాయపడ్డ భాష గుర్తుకురాదు
నీ వంటి మీద గాయాన్ని చూస్తూ కూడా అతని ఆయుధాన్ని పొగడుతూ పూజ చేస్తావు ...!
నీది మితిమీరిన కళారాధన
పోయింది మీ ఇంటి ప్రాణాలైతే కదా ...!
ఒలికింది మీ నెత్తురు కాదు కద ....!
పంజాబ సింధు గుజరాత మరాఠా
తెలంగాణా ఆంధ్ర ఉత్కళ వంగా
సరికొత్త జాతీయగీతపు సవరణలో
చెరోపదాన్ని చేర్చినందుకు మీకు సలాం
కిన్నెరమెట్ల కాళ్ళకి సలాం
వెలుగుల వేదికకి సలాం
అమరవీరులకు సలాం
ఉడుకుతున్న క్రొనెత్తురుకు వందనం
ఉద్యమ యుద్దాల బరిలో నిలిచి
సర్వం కోల్పోయి చావలేక బతకలేక
నడిమధ్యలో ఊగిసలాడుతున్న
కొనఊపిరి ప్రాణాలకు సలాం
ఇజాల నిజాలపై ఊరేగుతున్న
కళామతల్లికి దండం
రేపొద్దున్న మళ్ళీ ఓట్ల కొట్లాటలో
కలుసుకుని తిట్టుకుందాం....!
ఇప్పటికి సెలవు సోదరా
రక్తికట్టేలా రాసుకున్న నాటకాలని
వేదికలెప్పుడూ మర్చిపోవు ....!
- అనిల్ డ్యాని, 9703336688