Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్నేహానికి ప్రతిఫలంగా తాను చస్తే కేవలం ఒక కన్నీటి బొట్టుని మాత్రమే తన స్నేహితుల నుంచి ఆశిస్తున్న యీ కవి నిర్మల హృదయం యీ పంక్తుల్లో స్పష్టంగా గోచరిస్తుంది. ఇక తనవల్ల అంత వరకూ యెంతో ప్రయోజనం పొందిన ఆప్తులు ఆయన వృద్ధాప్యంలో ఆయన్ని ఒంటరి వాణ్ణి చేసి దూరంగా వెళ్ళిపోతే, తపించిన ఆయన గుండె ఘోషించిన కవిత, నా కన్నులో నిండిన కన్నీళ్ళు నాకీనాడు మిగిలిన సొంత ఆస్తి అండగ యెవరూ లేకుంటే నిండిన కన్నీరెండిపోతే నన్నేమనుకోవాలి నేనేమై పోవాలి ఇక తన అకాంక్ష గురించి వివరిస్తూ,
ఈ భువిలో యేదీ యెవరికీ కాదు సొంతం. మనమున్నంతవరకే యేదైనా మన సొంతం
శ్వాసాగితే మనదనుకొన్నది అన్యాక్రాంతం
మానవ జీవిత కఠోర నగ సత్యాన్ని మూడు పంక్తుల్లో దర్శింప జేసిన, తగిన గుర్తింపు పొందని, మరొక తెలంగాణ కవి ఇనుకొండ.
అంతేకాదు.. నే చస్తే ఏడుస్తూ ఒక కన్నీటి బొట్టు రాల్చడానికి ఎందరినో నా స్వేద బిందువుల్లో చూసు కొంటున్నాను ప్రేమతో అక్కున చేర్చుకొంటున్నాను స్నేహితుడనై ఆత్మీయత పెంచుకొంటున్నాను. అంటాడీ కవి. తన స్నేహానికి ప్రతిఫలంగా తాను చస్తే కేవలం ఒక కన్నీటి బొట్టుని మాత్రమే తన స్నేహితుల నుంచి ఆశిస్తున్న యీ కవి నిర్మల హృదయం యీ పంక్తుల్లో స్పష్టంగా గోచరిస్తుంది.
ఇక తనవల్ల అంత వరకూ యెంతో ప్రయోజనం పొందిన ఆప్తులు ఆయన వృద్ధాప్యంలో ఆయన్ని ఒంటరి వాణ్ణి చేసి దూరంగా వెళ్ళిపోతే, తపించిన ఆయన గుండె ఘోషించిన కవిత,
నా కన్నులో నిండిన కన్నీళ్ళు నాకీనాడు మిగిలిన సొంత ఆస్తి అండగ యెవరూ లేకుంటే నిండిన కన్నీరెండిపోతే నన్నేమనుకోవాలి నేనేమై పోవాలి
ఇక తన అకాంక్ష గురించి వివరిస్తూ,
ఎండకాలపు యెండల్లో
కండకరిగి మండే గుండెల్లో
అండగా నేనొక్కడే ఉండి పోవాలనుంది
అంటూ అశిస్తాడు. ఇక వేయి స్తంభాల గుడిని వర్ణిస్తూ
ఓ! కాకతీయ సామ్రాజ్యపు కళాఖండమా
కవి కవనానికందని శిల్ప కళచతుర్యమా
శిల్ప కళామతల్లి ముద్దుల వేయి స్తంభాల శిల్ప సోయగమా
శతకోటి ధవళ కాంతులు దశదిశలా విరాజిల్లిన శిల్పమా
కాల ప్రవాహంలో కనుమరుగై పోతున్న తీరు చూస్తే పతనమై శిథిలమై పోతున్న శిలా ప్రతిమల్ని గమనిస్తే
పరమ శివుడు, నందీశ్వరుల విరిగిన నడుముల్ని పరికిస్తే
చిన్న బోతుంది నాటి శిల్ప కళామతల్లి వదనం
అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. హైదరాబాద్ పాత నగరం లోని పత్తర్ ఘట్టి గురించి చెబుతూ
భగ భగ మండిన సూర్యుడు
రక్తంతో తడిసి రాళ్ళల్లో కెళ్ళాడు
రక్తసిక్తమైన రాళ్ళీనాడు చరిత్రకు పునాదులైనాయి
అంటూ చరిత్ర పుటల్ని మన ముందుంచుతాడు.
ఈ విధంగా చెబుతూ బోతే యెన్నో- యెన్నెన్నో కవితలు ఆరు దశబ్దాలుగా ఆయన కలం నుండి వెలువడ్డాయి చాలా కవితలు ఆనాటి గోలకొండ పత్రిక, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, గౌతమి, జ్వా ల, ప్రజా లాంటి ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి ముఖ్యంగా, ఆయన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరికం చేశారు. శ్రీశ్రీ తొ సాన్నిహిత్యం పెంచుకొన్నారు. దివాకర్ల వెంకటావధాని గారితో సాహిత్య సమాలోచనల్ని చేశారు. అచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి గారితో అత్మీయతని పెంచుకొన్నారు. వీరందరి ప్రభావం ఆయన రచనల్లో గోచరిస్తుంది.
ఇక ఇనుకొండ గారి ప్రతిభ కేవలం కవిత్వానికి మాత్రమేపరిమితం కాలేదు.కొన్ని నాటకాల్ని రచించి వాటిలో నటించి ప్రముఖుల ప్రశంసలనందుకొన్నారు. ''నవత'' ''జనక్రాంతి'' పత్రికల సహాయ సంపాదకులుగా బాధ్యతల్ని నిర్వహించారు. 'సెవెన్ స్టార్ సిండికేట్'' సంయుక్త కార్యదర్శిగా పని చేశారు.
వీటితో పాటు వివిధ సాహిత్య సభల నిర్వహణల్లో అయనకాయనేసాటి. ఆయన జీవిత కాలంలో సుమారు 1500 సభలకు సారథ్యం వహించారు. మరొక్క అంశం- ప్రముఖుల సన్మాన పత్ర రచనల్లో ఆయన చేసిన ప్రయోగాలు వర్ణనాతీతం .ఎందరో ప్రముఖుల యిండ్లలో భద్రపరచబడి యీ నాటికీ, గోడల మీద దర్శనమిస్తున్న వేలాది సన్మాన పత్రాలు,సన్మాన పత్ర రచనలో ఆయన నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
ఆయన నిరంతర కృషి కి చిహ్నంగా ఆయనకు యెన్నో బిరుదులు లభించాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి, సభా సారథి, సభా విరాట్, బహు సహస్ర సన్మాన పత్ర రచనా దురంధర. ఆయన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి మధుర కృతి, మధుర స్మృతులు, మధుర వెంకట స్మృతులు ,బృందావనం, మధురశ్రీలు ఇనుకొండ గారి పూర్తి పేరు ఇనుకొండ నరసింహా రెడ్డి. కరింనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, మల్లాపురం గ్రామానికి చెందిన, శ్రీమతి మధురా దేవి, వెంకట రెడ్డి దంపతులకు అక్టోబర్ 16, 1939 రోజున ఆయన జన్మించారు. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళశాల విద్యార్థిగా ఉస్మానియా యునివర్సిటి నుంచి పట్టభద్రుడై అదే యునివర్సిటిలో 37 సంవత్సరాలు వివిధ విభాగాల్లో పనిచేసి 1999లో పదవీ విరమణ చేశారు.
నిరంతరం సమాజ సేవలో వివిధ కర్య క్రమాలు నిర్విహించిన ఇనుకొండ నరసింహా రెడ్డి జూన్ 13, 2021 రోజున హైదరాబాద్-రామంతపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. వందలాది కవితల్ని, వేలాదీ సన్మాన పత్రాల్ని, స్మృత్యంజలుల్ని, సృష్టించి యిచ్చిన ఆయన కలం ఆ రోజుతో శాశ్వతంగా మూగపోయింది. దూరంగా, ఒక ఆప్తమిత్రుని కళ్ళల్లో నుంచి జారిన ఒక కన్నీటి బొట్టు నేలమీద పడింది.
- బసవరాజు నరేందర్ రావు