Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ఈ నెల 16 బుధవారం సలీమా కవిత్వం 'జవాబు కావాలి' పుస్తకావిష్కరణ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగం పల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌హాల్‌లో సాయంత్రం 5 గం||లకు ఐద్వా రంగారెడ్డి జిల్లా నాయకురాలు ఎస్.కె.మస్తాన్బి పుస్తకావిష్కరణ చేయనున్నారు. నస్రీన్‌ఖాన్ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, అతిథులుగా ప్రముఖ కవి శిలాలోలిత, ప్రముఖ కవి, విమర్శకులు గుడిపాటి, తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, తెలుగు యూనివర్శిటీ డిప్యూటీ డైరెక్టర్ అయినంపూడి శ్రీలక్ష్మి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతలు మెర్సీ మార్గరెట్, మానస ఎండ్లూరి, ప్రముఖ కవి జరీనా బేగం హాజరు కానున్నారు. రచయిత విప్లవ్‌కుమార్ పుస్తక పరిచయం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.