Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన భారతీయ సినీరంగంలోని మహత్తర నటుడి జీవితాన్ని కళ్ళముందు నిలిపిన పుస్తకం 'తహ్జీబ్ కా బాద్ షాV్‌ా దిలీప్ కుమార్ ' సినిమాల సమగ్ర పరిచయం. నటనలో తనకంటూ ప్రత్యేక డిక్షన్ ను రూపొందించుకుని ఇతర నటులకు భిన్నంగా నిలిచిన ఈ నటుడి మొత్తం సినిమాలను కూర్చిన ఏకైక పుస్తకం ఇదే. నటనలో ఇన్స్టిట్యూట్ గా చెప్పుకునే దిలీప్ కుమార్ ను దేశం గత ఏడాది కోల్పోయింది. ప్రముఖ విమర్శకురాలు, సినీ, సాహిత్య ప్రేమికురాలు పి.జ్యోతి ఆ మహానటుడికి నివాళిగా వెలకట్టలేని ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. పరిపూర్ణ నటుడిగా తనను తానే మలుచుకున్న గొప్ప నటుడిని ఈ తరం తెలుగు పాఠకులకు పరిచయం చేయాలనే పట్టుదలతో ఇంతటి కషి చేశారు. ఇటీవలే విడుదలైన ఈ పుస్తకం అనేకమంది విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నది. ఈ పుస్తకంలోని మరిన్ని విశేషాలు...
భారతీయ సినిమాలు రూపొందుతున్న రోజులవి. పథ్వీరాజ్ కపూర్, దాదాసాహెబ్ ఫాల్కే తదితరులు నటనకు, సినిమాకూ ఉండవలసిన శైలిని సష్టించేందుకు అప్పటిదాకా మెలోడ్రామా, ప్లేబాక్ తరహాలో నటులు అరిచి డైలాగులు చెబుతూ నటనను కొనసాగిస్తున్నారు. అప్పటికే మూకీ నుంచి టాకీలో రూపొందుతున్నాయి సినిమాలు. అదే సమయంలో బతుకు తెరువు కోసం సినిమా ఇండిస్టీలోకి అడుగుపె బాగాట్టారు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్.
అప్పటిదాకా ఆయనకు సినిమా అంటే ఏమిటో తెలియదు. యూసుఫ్ ఖాన్ ప్రవేశం నాటికి ఆయన కన్నా ముందు ప్రవేశించిన నటులు ఎంతోకొంత హాలీవుడ్ నటుల నుంచి మెళకువలు నేర్చుకుంటూ ఇక్కడి సినిమాలో ప్రవేశపెడుతున్నారు. అటువంటి సమయంలో మెథడ్ యాక్టింగ్ అంటే ఏమిటో తెలియకుండానే ఆ దిశగా స్వీయ ప్రయోగాలు చేశారట మన యూసుఫ్ ఖాన్. ఆయనే దిలీప్ కుమార్. ఆ తరువాత మెథడ్ యాక్టింగ్ కు బెంచ్ మార్క్ సెట్ చేసిన బాలీవుడ్ నటదిగ్గజం అయ్యారు. యూసుఫ్ ఖాన్ నుంచి దిలీప్ కుమార్ గా, భారతీయ సినిమా తొలి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కార గ్రహీతగా, ట్రాజెడీ కింగ్ గా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మభూషణ్ గా, పద్మవిభూషణ్ గా... ఇంకా ఎన్నెన్నో మలుపులు దిలీప్ కుమార్ నటప్రస్థానంలో నమోదు చేసుకుని ఉన్నాయి.
సొంత శైలితో అవతరించిన నటుడు దిలీప్ కుమార్ చేసింది 62 సినిమాలే కావొచ్చు. సినిమాలో సాంకేతికత పెరిగి నిర్మాణం మరింత సులభమై ఉండొచ్చు. ఈనాటి భవంతికి ఆనాడు వేసిన పునాదే మూలం. ఆ పునాది వేయడానికి ఎందరో గొప్పవారు చెమటోడ్చారు. అంతటి శ్రమకోర్చి దిలీప్ కుమార్ 62 సినిమాల్లో నటించడం గొప్పవిషయమే. 'క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం' అంటారే ఆ రకంగా దిలీప్ నటనలోని క్వాలిటీయే ఈనాడు ఆయనను దేశం గర్వించదగ్గ నటుడిగా నిలబెట్టింది.
ఉత్తమ నటుడిగా ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న రికార్డు ఆయనది. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నవారిలో ఎనిమిది ఫిలింఫేర్ లు అందుకున్నది షారూఖ్ ఖాన్. దిలీప్ సెట్ చేసిన రికార్డు ఇంకా ఎవరూ బ్రేక్ చేయక పోవడం ఇక్కడ చెప్పుకో దగిన అంశం. దిలీప్ కుమార్ స్థాయిలో ఫిలింఫేర్లు అందు కున్న షారూఖ్ అందాజ్ సినిమాలో ప్రేమ, రొమాన్స్ ప్రదర్శనల్లో ఆయన్నే అనుసరించానని చెప్పుకోవడం విశేషం. ఒక్క షారూఖ్ మాత్రమే కాదు ఈనాడు గొప్ప నటుడిగా ఆరాధించే కమల్ హాసన్ తన గుణ సినిమాలో దిలీప్నే అనుసరించినట్లు చెప్పుకున్నారు. అమితాబ్ కూడా తన నటనలో దిలీప్ ప్రభావం ఉందని ఒప్పుకోవడం విశేషం. ఈ ముగ్గురు నటులే కాదు, సినీ రంగంలోకి నటులుగా అడుగుపెట్టే ఔత్సాహికులకు శిక్షణనిచ్చే ఇన్స్టిట్యూషన్స్ దిలీప్ కుమార్ సినిమాల ద్వారానే శిక్షణను ఇస్తారట.
ఇలాంటి అనేకానేక ఆసక్తికరమైన విశేషాలతో అద్భుతమైన పుస్తకాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు స్ప్రెడింగ్ లైట్ నిర్వాహకులు, విమర్శకులు పి.జ్యోతి. పుస్తకాలు, సినిమాలే తనను తీర్చిదిద్దాయని చెప్పుకునే ఆమె దిలీప్ కుమార్ మరణా నంతరం అతడిపై సరైన పుస్తకం రాలేదన్న అసంతప్తి తో తానే పుస్తకాన్ని రచించ డానికి పూనుకున్నారు. ఏ పుస్తకాన్నైనా సునాయాసంగా చదివే జ్యోతి, జాతీయ అంత ర్జాతీయ సినిమాలను చూసి అనాయాసంగా విశ్లేషించే ప్రతిభ ఆమె సొంతం.
ఆమె దిలీప్ కుమార్ సినిమాల ద్వారా ఏం నేర్చుకోవచ్చో, వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చో అందరికీ తేలికగా అర్థమయ్యే శైలిలో విశ్లేషించారు. స్వతహాగా అధ్యాపకురాలు కావడం కూడా సులభరీతిలో అర్థమయ్యేలా పుస్తకాన్ని తీర్చిదిద్దడానికి దోహదపడిందని చెప్పవచ్చు.
పాఠశాల స్థాయి నుంచే హిందీ భాష నేర్చుకోవాలనే పట్టుదలకు దిలీప్ కుమార్ డిక్షన్ ఎంతగానో తోడ్పడింది అంటారు రచయిత్రి తన ముందు మాటలో. ఎంతో క్రమశిక్షణతో తనను తాను మలుచుకున్న నటుడు దిలీప్ కుమార్. అందుకే తన జీవితంపై ఎంతో ప్రభావం చూపారు అంటారామె. దిలీప్ సినిమాలను తేలికగా అర్థం చేసుకోవడానికి రచయిత్రి ఆసక్తికరమైన పంథా అనుసరించారు. ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న సినిమాల నుంచి, నామినేట్ అయినవి, అవార్డులకు నోచుకోని ట్రాజెడీలు, మల్టీస్టారర్ తదితర ఎనిమిది విభాగాలుగా మలిచారు పుస్తకాన్ని. ఈ విభాగాలలో అప్పట్లో సంచలనం సష్టించిన చిత్రరాజం మొఘల్ ఎ ఆజం సినిమానే ఒక ప్రత్యేక విభాగంగా జత చేశారు. సినిమాకు ముందు, సినిమా తరువాత, సినిమాలో... ఇలా విశేషాలను విడమర్చి మరీ రాసారు. పుస్తకం చూడగానే ఎంత నిజాయితీగా ప్రయత్నించారో అర్థమవుతుంది. ఒక్కొక్క సినిమాను ఆమె విశ్లేషించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి ఎందరో సినీ విశ్లేషకులు చేయాల్సిన బహత్తర బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. నూటికి నూరు శాతం న్యాయం చేశారు. ఆమె మాత్రమే ఇంత శ్రమకోర్చగలరు అనిపిస్తుంది పుస్తకం చూస్తే. కచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకం. సాహితీ ప్రియులు తమ లైబ్రరీలో ఉంచదగిన పుస్తకం. సినీ ప్రియులు, సినీ నటులు తమ లగేజ్ లో పెట్టుకుని నిత్యం రెఫరెన్సుగా వాడుకోవలిసిన పుస్తకం. ఆపాత మధురాలను వద్ధులు పలవరించవచ్చు. యువకులైతే... తెలుసుకోవచ్చు.
- నస్రీన్ ఖాన్
9652432981