Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడ్డ కట్టుకొని
పోయే చలిలో
కొండలు, లోయలే కాదు
ఇంటి నుంచి బయటికెళ్లిన
పిల్లల ఆచూకి తెలియక
బాలింతలు కూడా
ఘనీభావిస్తారేమో !
చెట్టు పై
కొమ్మ చిటారున
చివురు విచ్చుకోలేక
మారాకు తొడగనని
మరాం చేస్తుందేమో !!
వంటి నిండా మేకులు దిగ్గొట్టినట్టున్న
పహరాల నడుమ
కొండలన్నీ కఫన్ని కప్పుకొని
ఉశ్చవాస, నిశ్వాసలకు
సెలవు చెప్పేస్తాయేమో !!!
మడమల్లో వేళ్ళు, గోర్లు మొలుచున్నారు
చెదమేసిన కాగితాల్లో
భవిష్యత్తు గమ్యం
భూమి బల్లపరుపుగానే వుంది
నీటి శిలలు కరిగి పోయి
నెల మిగలదు
కన్నీళ్ళే రాజ్యమేలుతారు
సంతోషం అనే చివురు కనుమరుగౌతుంది.
ఒకే రకం చెట్టుంటే
అడివి అనిపించుకోదు.
పాలకులు ఎప్పుడూ నేల విడిచి సాము చేస్తారు
రంగు,రంగుల పూల (ఙaశ్రీశ్రీవy శీట టశ్రీaఙశీతీర) లోయలన్నీ
మరిచిపోయిందేమో నేల.?
- హనీఫ్, 8328586518