Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేతి గీతలు జీవిత గమనాన్ని నిర్దేశించలేవు
మనం గీసుకున్న గీతలు మాత్రం
మత్యు ఘంటికలు మోగించగలవు
ప్రపంచం ఆకలి అంచున వేలాడుతున్నా
సామ్రాజ్య కాంక్ష కయ్యానికి కాలు దువ్వగలదు
హద్దులు దాటి సరిహద్దులు చెరపగలదు
నిన్నటిదాకా కరోనా
కాట్లో ఉన్నంత విషాదాన్ని మిగిల్చినా
కలిసుందామన్న సోయే లేకపాయే
కోతి పెట్టిన చిచ్చుతో పిల్లుల్లా
కొట్టుకు చావడమే మనకు తెలిసిన నీతాయె
శాంతి ఒప్పందాలు బుట్ట దాఖలవుతున్నాయి
దురాశ అంతరిక్షానికి అర్రులు చాస్తుంది
ఆధిపత్యమే అణ్వాయుధమై
ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్న వేళ
ప్రపంచ దేశాలు కూటమి కట్టడం మాని
సర్వమానవ సౌభ్రాతత్వానికి
సంధి కుదర్చడమే తక్షణ కర్తవ్యమని భావించాలి
- గుండు కరుణాకర్,
9866899046