Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైలు
ప్రయాణం మొదలయ్యింది
ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు
ఇప్పుడు నేను కూర్చున్న
76 వ నెంబర్ సీటు
నిన్న ఎవరిదో ఆధారాలు ఉండవు
కిటికీలో దశ్యాలు
క్షణాల్లో మారిపోతున్నారు
నా ముందు వెనుక
మనుషులున్నారు
పరిచయం లేని మనుషులు
ఇదివరకు చూడని, కలవని మనుషులు
అప్పుడెప్పుడో
రెండు వైపులా
ఎవరో నాటిన చెట్లు
భూమికింత నీడ నిస్తున్నారు
రైలు
పోతూనే ఉంది
అక్కడక్కడ
సమాధులు కనిపిస్తున్నారు
ఎక్కడో ఒక చోట
రైలు ఖాళీ ఐపోతుంది
జీవితం లాగా
అప్పుడు
నా సీటు
ఎవరు భర్తీ చేస్తారో
తెలియడం లేదు
- సుంకర గోపాలయ్య
9492638547