Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వార్థమే
రాజ్యమేలుతున్న వేళ,
సామ్రాజ్య వాదమే
సాగుతున్న వేళ
రణమే సాధారణం..
శాంతి ఓ విరామం.
ప్రపంచమే యుద్ధ రంగమైతే
ప్రారంభించిన వాడొక్కడే
ముద్దాయి కాదు
ప్రేరేపించేవాడూ,
ఆజ్యం పోసేవాడూ
అపరాధిని నిలదీయక,
చోద్యం చూసేవాడూ
అందరూ ముద్దాయిలే.
ఆత్మ రక్షణకో యుద్ధం
ఆయుధ విక్రయానికో యుద్ధం
దురాక్రమణకో యుద్ధం
పరాక్రమ ప్రదర్శనకో యుద్ధం
యుద్ధమో,
యుద్ధానికి సన్నద్ధమో
అనుదినమూ తప్పని తద్దినం
యావత్ ప్రపంచమే క్షతగాత్రం.
- డా. డి.వి.జి.శంకర రావు
94408 36931
మాజీ ఎంపీ, పార్వతీపురం