Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయించడం నిత్యకృత్యమైనట్లు
హోళీ ఆడడం కూడా దినచర్యే సూర్యుడికి !
రంగుల బాలభానుడు తలంటు పోసుకొని
ధవళ సూర్యుడైపోతాడు కొంత పొద్దు తర్వాత !
సూర్య లింగమైపోతాడు మబ్బు కుంచెలు
తనని తాకినపుడు !
ఈ మబ్బు కుంచెలు
చంద్ర తూనీగలని కూడా రచిస్తుంటాయి.
మేధోవక్రలు మేఘాల్లో మునిగి తేలుతున్నారు
ధైర్యం చినుకులని రాలనీయడం లేదు
క్షితజరేఖలు దాటి నా సత్యవ్రతపు హోమగుండాలు కానరావడం లేదు
జగత్తు అంతా శరణాగత చరణాలని గానం చేస్తుంది
పగటినీ, రాత్రినీ
మత్తుతో ఊకొడుతున్నారే తప్ప
సత్తువతో కాదు
కళ్ల మీద
కాపురాలు కూల దోసే కలల రెక్కీ
సాయంత్రం హోళీలో
సామూహిక సమాధులు దాటి
ఆకాశం తెరలో దూరిపోతున్నాడు సూర్యుడు
లిలిలి
కళా శంగం
ఓ చిలక్కొయ్య !
ఆదర్శాత్మ తగిలింపబడి ఉంటుంది దానికి !
జీవరీతి హదయం వేలాడుతూ ఉంటుంది దానికి !
అదనపు విలువ అధికార నియంత తత్వాన్ని
నిలదీస్తూ ఉంటుంది !
శరణార్ధ సమూహాలకి దారి దీపం అవుతుంది !
మానవ గోపురాన్ని నిలబెడుతూ ఉంటుంది !
- ఒబ్బిని, 9849558842