Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి. మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి. మంచి సాహిత్య విమర్శ రావాలంటే ఆ విమర్శ కూడా విమర్శకు గురి కావాలి.''
- కొడవటిగంటి కుటుంబరావు
మనదేశంలో తెలుగు, మాతభాషగా 4వ స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలుగు మాతభాషగా మాట్లాడే వారి శాతం 6.70. తెలుగు భాష 15 కోట్ల నాలుకల పై నానుతుంది. ఇది తెలుగువాళ్లు గర్వించదగిన విషయం.
తెలుగు సాహిత్యం ప్రాచీన కాలం నుంచే మనుగడలో ఉంది. ఆనాటి కవులు రామాయణం, మహభారతం, భగవద్గీత మరియు పురాణాలు తెలుగు భాషలోకి తీసుకొచ్చారు. ఆరవ శతాబ్దం నుంచి పురాణాలు తెలుగులో కావ్యాలుగా వెలుగొందాయి. అవి రాజుల దర్బారులలో అంతకు క్రితం మునుల చేతుల్లో తాళపత్రాలలో బంధించబడింది. అడవులలో పర్ణశాలల్లో క్రమబద్దమై పోయింది. కాని ఇవి ఆ రోజుల్లో సాహిత్యం విమర్శ క్రిందికి రాలేదు. ఆధునిక కాలంలో ప్రాచీన సాహిత్యం వెలుగులోకొచ్చాక అది సాహిత్య విమర్శలు అందుకోసాగింది. ఆ సాహిత్య విమర్శలను స్వాగతించిన వారు బహు కొద్దిమందే అయినా అవి పురాణాలు, మతాలకు సంబంధించినవి కావడం వల్ల వాటి జోలికి వెళ్లకుండా చాలా మంది విమర్శకులు భుజాలెగురేసుకున్నారు.
సాహిత్యంలో వివిధ ప్రక్రియలున్నాయన్న వాస్తవం మనకు తెలుసు. కవిత, కథ, నవల, వ్యాసం, నాటకం వగైర వగైరాలు ముఖ్యమైనవి. ఇవి తెలుగు సాహిత్యానికి మూల వేళ్లు. తెలుగు సాహిత్య వక్షం వటవక్షమై శాఖోపశాఖలుగా ఎదిగింది. ఎదుగుతోంది.
ఏ ప్రక్రియలోని సాహిత్య రచన అయినా దానిపై నిస్పాక్షిక, సూక్ష్మ సాహిత్య దష్టిని సారించడమే విమర్శ. తొలి మజిలి. ఇలా మజిలీలుగా సాగే సాహిత్య ప్రయాణమే సాహిత్య అవగాహన.
సాహిత్యం నీటి ప్రవాహం లాంటిది. ఇలా రాయకూడదు. ఇలాగే రాయాలనే అంక్షలు రచయితలకు పెట్టడం కుదరదు. సమంజసం కాదు.
ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్ది గారి 'తెలుగు సాహిత్య చరిత్ర' ననుసరించి సాహిత్య యుగాలను ఏడుగా విభజించి, అప్పటి సాహిత్య గమనాన్ని విశదపరిచారు. ఆయా కాలాల రచయితల, కవుల గురించిన ముచ్చట కూడా బాగా పొందుపరిచారు. అవి :శాతవాహనుల యుగం, వేములవాడ చాళుక్య యుగం, కాకతీయుల యుగం, రాచకొండ పద్మనాయకుల యుగం, కుతుబ్ షాహీల యుగం, అసిఫ్ జాహీల యుగం, విశాలాంధ్ర యుగం. ఈ సాహిత్య యుగాలలో దాదాపు అన్నీ కాలాలలో తెలుగు సాహిత్యం మూడు పూవులారు కాయలై బాసించింది. అక్కడక్కడ కొన్ని లోపాలుండవచ్చు. సందేహం లేదు!
సాహిత్య విమర్శ :
విమర్శకు ఓ నిర్దిష్టమైన నిర్వచనం లేదు. కాని చెప్పుకోవడానికి కొన్ని నిర్వచనాలు ఇలా ఉంటాయి...
సాహిత్యం అధ్యయనం, మూల్యాంకనం, వివరణయే సాహిత్య విమర్శ. ఆధునిక సాహిత్య విమర్శ తరచుగా సాహిత్య సిద్ధాంతాల ద్వారా ప్రభావితమవుతుంది. ఇది సాహిత్య లక్ష్యాలు మరియు పద్ధతుల తాత్విక చర్చ.
మరొక విధంగా చెప్పుకోవాలంటే, సాహిత్య విమర్శ అంటే సాహిత్య రచనల పోలిక, విశ్లేషణ, వ్యాఖ్యానం, లేదా మూల్యాంకనం. సాహిత్య విమర్శ తప్పనిసరిగా ఒక అభిప్రాయాన్ని, ఆధారాల ద్వారా వెల్లడించడం.
సాహిత్య విమర్శ, సాహిత్య సిద్ధాంతానికి దగ్గరి సంబంధం కలిగి ఉన్నప్పటికీ సాహిత్య విమర్శకులు, సిద్ధాంతకర్తలు ఒకే తాటిపై నిలబడరు. వీరిద్దరి దక్పథం భిన్నంగా ఉంటుంది.
ఉదాహరణకు, జాన్స్ హాప్కిన్స్ 'గైడ్ టు లిటరరీ థియరీ అండ్ క్రిటిసిజం' ప్రకారం సాహిత్య సిద్ధాంతం, సాహిత్య విమర్శల మధ్య తేడా లేదు. కాని కొంతమంది విమర్శకులు సాహిత్య విమర్శను సాహిత్య సిద్ధాంతపు ఆచరణాత్మక అనువర్తనంగా భావిస్తారు (practical application of literary theory) ఎందుకంటే విమర్శ ఎల్లప్పుడూ నిర్దిష్ట సాహిత్య రచనల (particular literary works) తో నేరుగా వ్యవహరిస్తుంది.
సాహిత్య విమర్శ తరచుగా వ్యాసం లేదా పుస్తక రూపంలో ప్రచురించ బడుతుంది. బోధన (అకాడెమిక్) సాహిత్య విమర్శకులు సాహిత్య విభాగాలలో బోధిస్తారు. అకాడమిక్ జర్నల్స్‌లో ప్రచురిస్తారు. సాధారణ, ప్రజాదరణ పొందిన విమర్శకులు తమ సమీక్షలను విస్తతంగా ప్రసారం చేసే పత్రికలలో ప్రచురిస్తారు. అవి వార్త పత్రికలలోని సాహిత్య పేజీలలో చోటు చేసుకొంటాయి. సాహిత్య వార, మాస పత్రికల్లో కూడా ప్రచురిత మవుతాయి. సాహిత్య విమర్శ కథలు, నవలలు, కవితలు, నాటకాలు మొదలైన సాహిత్య ప్రక్రి యలు పుస్తకరూపంలో వస్తుంటాయి. ఈ రోజుల్లో డిజిటల్ మాధ్యమం మనుగడలో ఉంది.
సాహిత్య విమర్శ యుగాన్ని ప్రపంచ భాషలతో సంధానించి వర్గీకరిస్తే ముఖ్యంగా ఐదు యుగాలుగా పేర్కొనబడుతాయి. అవి, 1. శాస్త్రీయ, మధ్యయుగ విమర్శ (Classical and medieval criticism)లో శాస్త్రీయ కాలం 1200 BCE నుండి 455 CE వరకు, మధ్యయుగ కాలం 500 AD-16th Century వరకు.
2. పునరుజ్జీవనోద్యమ విమర్శ (Renais-sance criticism (1485-1660 AD).
3. జ్ఞానోదయ కాలం విమర్శ (Enlightenment period 1700 AC-1800 AC).
4. 19వ శతాబ్దపు శృంగార విమర్శ (19th-Century Romantic criticism)
5. 20వ శతాబ్దపు సాహిత్య విమర్శ (20th-Century criticism)
సాహిత్యం నవరసాల కూటమి. వీటిపై వస్తూన్న విమర్శల గురించి చర్చిండానికి వ్యాసం కాదు ఓ పుస్తకం కావాలి. రావాలి. వస్తున్నాయి.
ముగింపు కాని ముగింపు :
విమర్శన పకడ్బంధీగా పనిచేస్తుంది. కేవలం అక్షరదోషాలు, వాక్య నిర్మాణాలు, వ్యాకరణతో పాటు ఫలాన కథ, నవల, నాటకంలో నేపథ్యం, కథ నడచిన కాలం, స్థితులు, అప్పటి సంస్కతి, ఆర్ధిక రాజకీయ పరిస్థితులు కథకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అన్న సంగతిని కూడా దష్టిలో పెట్టుకొని విమర్శించాలి. విమర్శకుడికి దాని అవగాహన కూడా ఉండాలి.
తెలుగు నేలమీద తెలుగు సాహిత్యంలో విమర్శ, తమ శక్తి సామర్ధ్యాలతో సాము చేస్తూనే ఉన్నాయి. కాని రెండేళ్ళనుంచి ఎలాంటి కరుణ చూపించకుండా 'కరోనా కోవిడ్-19 విలయ తాండవం చేసింది!
ఫలితంగా ఈ కాలంలో ఎన్నో పత్రికలు... వార, పక్ష, మాస పత్రికలు మూతపడ్డాయి. పాఠకుల మనసు కొద్దిగా కలత చెందకుండ ఉండలేక పోయింది.
తెలుగుజాతి ఆశజాతి. రాబోయే రోజులు త్వరలో మళ్లీ మామూలు స్థితిలో కొచ్చితెలుగు సాహిత్యంలో విమర్శన పట్టాలెక్కి వేగం అందుకొంటుందని ఆశిద్దాం.
[email protected]
- అమ్జద్