Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశమ్మీంచి నేల మీదికి
దూకుతోన్న ఈ చినుకుల్లోనే మెతుకులున్నాయి
గగన సీమల గోదాముల్లోంచి
గోధుమల్ని సైతం పదిలంగా
ఈ వర్షబిందువులే మోసుకొస్తున్నాయి
భూమ్యాకర్షణ కన్నా
ఆకలికి ఆకర్షణశక్తి
గురుత్వమైనందువల్లనేమో
ఈ వాన బొట్లు
మన పొట్టల్ని నింపే రొట్టెలవుతున్నాయి
చిటపట కురిసే నీటి చుక్కల్లో
చక్కటి పప్పులుండటం ఎంత చిత్రాతిచిత్రం!
బారులు తీరి భువికి దిగి వచ్చే
వాన ధారల్లో
సకల సంబారాల సాంబారులుండటం
ఎంత విస్మయకరం!!
కొందరికివి వరుణుడు మీటుతోన్న
వాన వీణ తీగలు
నాకైతే నింగి పందిరి నించి
మట్టిలో నాటుకున్న కూరగాయల తీగెలు
ఈ గుడ్డి ముసురే
మా పొయ్యి మీది ఎసరులో వుంది
ఈ వాన తుంపరే ధాన్య పరంపరలో నిలిచింది
ఈ వష్టి సష్టికి మూలమైనట్లే
ఈ జల్లు
తడి తడి రాగానికి ప్రకతి వేస్తోన్న
తకధిమి తకధిమి తాళం
- నలిమెల భాస్కర్, 9846619934