Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని ఆంగ్ల కవితలను అనువదించడం అసాధ్యం కాకపోయినా కష్టం. అట్లాంటి వాటిలో ఈ కిందిది ఒకటి. దీన్ని ఆంగ్లంలో రాసిన వారు అనుపమా రాజు. ఇది Indian Literature, Issue No. 323 (May - June, 2021)లో అచ్చైంది. చదవండి.
If All Poetry Is Protest
If all poetry is protest
I protest poetry, this word
that could%µ%ve been
blood, home, privacy,
hate, wound, gun,
identity, freedom, heresy.
I protest metaphors
of love, dark alleyways
where could’ve been a woman
screaming dissent,
tongue untied.
If all poetry is protest
I protest ordinary longings,
lines that could be wrinkles
gathered over years of silence
on a face I know well.
I protest sentiment where
should have been a question:
Why do I write?
- Anupama Raju
ఇందులోని భావాన్ని అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. వచ్చిన చిక్కంతా సింటాక్స్‌ను ఫాలో అవుతూ అట్లానే అనువదించడంలోనే ఉంది. వచనపు సింటాక్సును వాక్యనిర్మాణ సంవిధానం అనీ, కవిత్వపు సింటాక్సును పంక్తినిర్మాణ సంవిధానం అనీ నా వ్యాసాలలో పేర్కొంటూ వస్తున్నాను నేను. సింటాక్స్ అంటే వాక్యాలను లేదా పంక్తులను రూపొం దించేటప్పుడు పదాలను, పదబంధాలను సరైన క్రమంలో అమర్చే విధానం. కవిత్వంలోని ఒక భావాంశం (unit of thought) కొన్ని పంక్తులకు విస్తరించి ఉండవచ్చునని ఇంతకు ముందొక వ్యాసం లో రాశాను. పై కవితలో నాలుగు units of thought ఉన్నాయి. వాటిలోని పంక్తుల సంఖ్యలు వరుసగా 6, 5, 5, 3. ఆంగ్లకవితలలో ఒక భావాంశం ముగిసిన తర్వాత సాధారణంగా పూర్ణబిందువు (ఫుల్ స్టాప్) వస్తుంది. మన తెలుగు కవితలలో అది రాకపోవడం వలన కొన్ని సార్లు అస్పష్టత ఏర్పడుతున్నదనేది గమనించ తగిన విషయం. మళ్లీ అసలు విషయానికి వద్దాం. ఒక భావాంశం కొన్నిసార్లు ఒకే పంక్తికి పరిమితమై కూడా ఉండవచ్చు. అప్పుడు దాన్ని అనువదించడం సులభం. కానీ చాలా పంక్తు లకు విస్తరించినప్పుడు అనువాదం కష్టమయ్యే వీలుంది. నిజానికి ఎక్కువ పంక్తుల్లో ఉన్నా మధ్య మధ్య బ్రేక్స్ (విరుపులు) ఉంటే అంత కష్టమేమీ అనిపించకపోవచ్చు.కానీ మాటలు continuous గా, contiguousగా, తప్పించుకోవడం కష్టమని పించే పొడగింపుల లాగా ఉన్నప్పుడు అదే continuityని, contiguityని, extensionను (పొడగింపును) అనువాదంలో తీసుకురావడం కష్టం. ఆ పంక్తులన్నీ కలిసి ఒక ఇనుప గొలుసులాగా ఉంటాయి మరి! ఈ సమస్యను అధిగమించేందుకు రెండు మార్గాలు న్నాయి. మొదటిది, అవసరమైన భావాంశాన్ని కొన్ని చిన్నచిన్న భావాంశాలుగా విడగొట్టి అనువదించడం. అనువాదంలో మొదటి unit of thought ను నేను రెండుగా విడగొట్టడాన్ని గమనించండి. కానీ అలా చేయడం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఒకవేళ కుదిరినా అట్లా అనువదించడం కొందరికి నచ్చక పోవచ్చు. పైగా అసంతప్తిని లేదా వెలి తిని కలిగించవచ్చు. సాధ్యమైనంత వరకు మూలంలోని భావాంశాన్ని ఉన్నదున్నట్టుగా అను వాదంలో ప్రతిఫలిం పజేయాలనే కోరిక ఒకటి ఉంటుంది. ఆ కోరిక నెరవేరే అవకాశం లేనప్పుడు రెండవ మార్గాన్ని అనుసరించాల్సి వుంటుంది. అదేమి టంటే, భావాంశానికి సంబంధించిన ఆ కొన్ని పంక్తులను వ్యతిరేకదిశలో అనువ దించడం. జాగ్రత్తగా పరిశీలిస్తే రెండవ, మూడవ భావాంశాలలో నేను ఈ పద్ధతిని అవలంబించిన సంగతిని గుర్తుపట్టవచ్చు (ఏ చీకటి నిండిన గల్లీల్లో అయితే/ ఒక స్త్రీ విభేదిస్తూ విచ్చలవిడిగా అరవ గలదో/ వాటినీ, ప్రేమోప మానాలనూ నిరసిస్తా న్నేను... మామూలు తపనలను, బాగా తెలిసిన ముఖాల మీద/ సంవత్స రాల నిశ్శబ్దంలో జమ అయిన ముడుతలను/ నిరసిస్తాన్నేను.)
ఇక్కడ మనం భావాన్ని రివర్స్‌లో అనువదించడం లేదు, పంక్తులను మాత్రమే రివర్స్‌లో అనువదిస్తున్నా మని గుర్తు పెట్టుకోవాలి. అంటే, ఇంగ్లీష్ సింటాక్స్ ప్రకారం ఉండే పంక్తుల క్రమం తెలుగు సింటాక్స్ ప్రకారం ఉండే పంక్తుల క్రమానికి విరుద్ధంగా ఉంటుందని అర్థం. కానీ రెండింటిలోని భావం ఒకటే! ఇట్లా పంక్తుల క్రమం విరుద్ధంగా ఉండటమనేది మొత్తం కవితలో ఉండదు, అక్కడక్కడ చిన్న భాగాలలో మాత్రమే ఉంటుంది.
చాలా పొడవైన ఒక పూలతీగను ఒకే ఫ్రేములో బంధించాల్సి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్ ఎదుర్కొనే సమస్యను ఈ సమస్యతో పోల్చలేమనుకుంటాను. ఫొటో గ్రాఫర్లకు సౌలభ్యాన్ని చేకూర్చే కొన్ని వెసులు బాట్లుంటాయి. ఉదాహరణకు వాళ్లు వెనక్కి పోయి మొత్తం తీగ ఒకే ఫ్రేములో వచ్చేలా ఫోటో తీయవచ్చు. అట్లా వెనక్కి పోవాల్సిరావడంలో పెద్దగా ఇబ్బంది ఏముంటుంది? Wide angle lens మొదలైన కొన్ని సాంకేతికమైన వెసులుబాట్లు కూడా ఉంటాయి వాళ్లకు. వీటిని పెద్ద శ్రమ అవ సరం లేని రెడీమేడ్ వెసులుబాట్లు అనవచ్చు. కానీ అనువాదం వేరు. అది మేధ, భాషా నైపుణ్యం మొదలైన అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి, దానికీ దీనికీ మధ్య పోలిక తేవడం అసంబద్ధమైనదనడంలో సందేహం లేదు.
పైన చెప్పిన విషయాలను పాటిస్తూ నేను చేసిన ఈ అనువాదాన్ని పరిశీలించండి. ఇది పూర్తిగా దోషరహితంగా ఉన్నదని అనడం లేదు. ఎవరైనా ఇంతకన్న బాగా కూడా అనువదించవచ్చు.
కవిత్వమంతా నిరసన అయితే...
కవిత్వమంతా నిరసనే అయితే
కవిత్వాన్ని నిరసిస్తాను నేను
కవిత్వమనే ఈ మాట
రక్తం, సొంత యిల్లు, ఏకాంతం,
ద్వేషం, గాయం, తుపాకి, ఉనికి చిహ్నం,
స్వేచ్ఛ, భ్రష్టమతం... ఏదైనా అయివుండొచ్చు
ఏ చీకటి నిండిన గల్లీల్లో అయితే
ఒక స్త్రీ విభేదిస్తూ విచ్చలవిడిగా అరవగలదో
వాటినీ, ప్రేమోపమానాలనూ నిరసిస్తాన్నేను
కవిత్వమంతా నిరసనే అయితే
మామూలు తపనలను, బాగా తెలిసిన ముఖాలమీద
సంవత్సరాల నిశ్శబ్దంలో జమ అయిన ముడుతలను
నిరసిస్తాన్నేను
నేనెందుకు రాస్తాను అనే ప్రశ్న
చోటు చేసుకునే భావోద్వేగాన్ని నిరసిస్తాను.
- ఎలనాగ 9866945424