Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ - పాలపిట్ట కథల పోటీ సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ-2022ని నిర్వహించనున్నారు. ఈ పోటీలో వస్తుశిల్పాల్లో వైవిధ్యం చూపిన కథలకు ప్రాధాన్యం లభిస్తుంది. పోటీలో నెగ్గిన కథలకు మొదటి బహుమతికి రూ.10 వేలు, రెండో బహుమతికి రూ.5 వేలు, మూడో బహుమతికి రూ.3 వేలతో పాటు, మరో ఏడు కథలని ప్రత్యేక బహుమతుల కింద ఎంపిక చేసి ఒక్కొక్క కథకి రూ.1000/- చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 20లోగా ఎడిటర్, పాలపిట్ట, ఎఫ్-2, బ్లాక్-6, ఏపిహెచ్బి, బాగ్లింగంపల్లి, హైదరాబాద్-500044 చిరునామాకు లేదా [email protected]కు వివరాలకు 94900 99327 నంబరు నందు సంప్రదించవచ్చు.