Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇద్దరి మధ్య
గొడవ మామూలే
తర్వాతి నిశ్శబ్దమే
భయంకరం
కలంలోంచి
పువ్వులు రాలుతున్నాయి
మొక్కలు మాత్రం
మనసులోనే
పెన్ను
రెండు రూపాయలదే
రాలిన అక్షరాలు మాత్రం
అమూల్యం
మా పాత టీవి
నాన్న బహుమతి
తీయలేను
పెట్టుకోలేను.
ఒంటరితనం
చాలా బరువు
ఒక రకంగా అది
జీవితానికి గురువు
ఓడిపోయావా?
బాధపడకు
గెలుపుకది
తొలి మెట్టు మరి!
మాటలు
మంచిగానే వున్నాయి
మనసులోనే
కనిపించని మలినం
రాయి కూడా
పాఠం చెబుతుంది
తాను వ్యర్థం కాదని
శిల్పం దాగుందని
అతడు
నిత్య సంతోషి
జేబుకన్నీ చిల్లులే
చిరునవ్వయితే చెరగదు.
- ఎన్. లహరి
9885535506