Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ పాత్రికేయులు కె రామచంద్రమూర్తికి అరుణ్‌సాగర్ పాత్రికేయ పురస్కారం, ప్రముఖ కవయిత్రి కుప్పిలి పద్మకు అరుణ్‌సాగర్ సాహితీ పురస్కారం అందించనున్నట్టు అరుణ్‌సాగర్ ట్రస్ట్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 12న ఉదయం 10:30లకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో అందించనున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న హాజరుకానున్నారు.