Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిటపటల ధోరణీకి
రెపరెపల నినాదమై
సమస్యల తీరుపై
నిరంతరం ఎగురుతూనే వుంటది
సగటు బతుకుల వేటుపై
జనజీవన సమైక్యతకై
అట్టడుగున పడిపోయిన
విలువలకు ఊతమౌతాది
ధరాఘాతపు అగాధంలో
మాయాజాల మార్మికాలను
ఏమార్చిన ఏలికల తీరుబడిపై
ఎర్రజెండా ఏకరువు
విప్లవ గీతమై ప్రజ్వలిస్తది
సమసమాజ నిర్మాణానికై
సమానత్వ సమన్వయానికై
అసమానతల రూపురేఖలపై
చైతన్యపు కిరణమై
విరుచుకు పడుతుంటది
ఎర్రజెండా సాక్షిగా
ఎలుగెత్తే ప్రతి నినాదం వెనుక
ఒక చీకటి కోణం
బద్దలౌతూనే వుంటది
మాటల గారడీల విన్యాసాలకు
ఎత్తుకు పై ఎత్తుల ఇంద్రజాలాలకు
ఉత్తుత్తి ఉపన్యాసాల
మభ్యపెట్టే ధోరణీల పాలిట
ఉక్కు పిడికిలై బిగుసుకుంటది
ఎర్రజెండా ఎగిరిన చోట
ఎర్రబడిన కళ్ళ నుంచి
ఒక పరిష్కారం ద్రవిస్తాది
ఒక సమన్యాయం ఉద్భవిస్తాది
- నరెద్దుల రాజారెడ్డి
9666016636