Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమృత కాలమ్లో
అడుగు పెట్టానని అంటే
గమ్మత్తు అనిపించింది
ఒక్కసారి గుడిసె బయటికీ వచ్చి
అటు ఇటు వెదికి నా
ఎక్కడ వున్నోన్ని అక్కడే వున్నానని
ఇంటామే గిల్లి మరీ చెప్పింది..
ఆత్మ నిర్భరత అన్నప్పుడు
గుండె పొంగి పోయింది
ఇక ఎదిగి పోయినట్లే నని
సబ్కా సాత్ లో నా వికాసముందని
చీకట్లు తొలిగి పోయాయని
ఫికర్ పడకని ఆమెకు చెబితే
ముందు పొయ్యి మీది సంగతి చూడమంది ...
తలసరి ఆదాయం
లక్షలు దాటింది అన్నప్పుడు
ఈ పూట కూలికి వెళ్ళబుద్ది కావట్లేదు
బడ్జెట్ వార్త తిప్పి తిప్పి చదువుతుంటే
పైసలన్నీ మన కోసమే అంటే
ధన్ మని వురికొచ్చి
పార చేతికిచ్చి వెన్ను చరిచింది.....
బడ్జెట్ రోజు న
భలే గమ్మత్తుగా వుంటాది
ఏ మాట కా మాటే
కనికట్టు చేయడానికి ఎంత కష్ట పడ్డారో.....
- దాసరి మోహన్, 9985309080