Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల భారత భాషా సాహిత్యసమ్మేళన్ జాతీయ మహాసభలు ఫిబ్రవరి 17భూపాల్ లయన్స్ క్లబ్లో జరగనున్నది. ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ విద్యావైద్యశాఖామంత్రి విశ్వాస్ సారంగ్, విశిష్ట అతిథిగా సంస్థ జాతీయ అధ్యక్షుడు డా.వీరేంద్రసింగ్లు హాజరవుతున్నారు. ఈ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే భారత్ భాషా భూషణ్ అవార్డు తెలంగాణ సాహితీవేత్తలు రఘుశ్రీ, పుట్టపర్తి నాగపద్మిని ,డా.కే.రామకృష్ణలు అందుకోనున్నారు. లైఫ్‌టైమ్ లిటరరీ అవార్డును తంగిరాల చక్రవర్తి, జి.పద్మావతి అందుకోనున్నట్లు అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ తెలంగాణ శాఖ అధ్యక్షులు కాడారి సత్యమూర్తి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.