Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సి.పి.కె. పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో 'బహుజన మహిళా కలాలు' పేరుతో సంకలనం తీసుకురానున్నారు. ఇందుకు విద్య, సాహితీ రంగాలలో బహుజన మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, సంతోషాలు, తాము కలం పట్టి కదం ముందుకు వేయడానికి ఎదుర్కొన్న ఒడిదుడి కులు, జీవితానుభవాలను రాసి పంపవచ్చు. సీనియర్ రచయిత్రులతో పాటు, వెలుగులోకి రాని యువ బహుజన రచయిత్రులు కూడా తమ అనుభవాలను పంపవచ్చు. ఆసక్తి కలిగిన వారు వారి జీవిత విశేషాలను 4 పేజీలలో రాసి, రెండు ఫొటోలు జత చేసి సి.పి.కె. మహిళా కలాలు, 4- 39/a ఎల్లమ్మతోట, మేడ్చల్, తెలంగాణ - 501401 చిరునామాకు పంపవచ్చు. లేదా 9849793914, 7780740694 వాట్సాప్ నంబర్లకు కూడా పంపవచ్చు.