Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ కవి విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ జె.బాపురెడ్డి(87) మృతి సాహితీలోకంలో విషాదం నెలకొంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండలో జులై 21, 1936లో జన్మించారు. కష్టపడి చదివి ఐఏఎస్ అధికారిగా ఉద్యోగం పొందారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌గానూ పని చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ, సాహిత్య అకాడమీ సభ్యుడిగా మొదటి ప్రపంచ తెలుగు మహాసభల కార్యదర్శిగా, అనేక సాంస్కృతిక సంస్థలకు జాతీయ, అంతర్జాతీయ సహాయ, సహకారాలు అందించి వివిధ దేశాల్లో పర్యటించారు. పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం వంటి సాహితీ విభాగాల్లో రాణించారు. 1960లో వచ్చిన 'చైతన్య రేఖలు' బాపురెడ్డి తొలి కవితా సంపుటి. తరువాత 'రాకెట్టు రాయబారం', 'హృదయ పద్యం', 'బాపురెడ్డి గేయాలు', 'బాపురెడ్డి గేయ నాటికలు', 'శ్రీకార శిఖరం', 'నా దేశం నవ్వుతోంది', 'మనసులో మాట' వ్యాస సంపుటి, 'మన సౌదామిని', 'ఆత్మీయ రాగాలు', 'జీవన శృతులు' పద్య కవితా సంపుటి, 'అనంత సత్యాలు', 'పంచబాణా సంచా', 'పద్యాల పల్లకి', 'నవగీత నాట్యం', 'కవితా ప్రస్థానం'తో పాటు వివిధ దేశాల పర్యటనల సందర్భంగా యత్రా కథనాలను పుస్తకాలుగా ప్రచురించారు. 'నాదేశం నవ్వుతోంది నందన వనంలా' వంటి వీరి లలిత గీతాలు ఇప్పటికీ రేడియో శ్రోతల చెవుల్లో తిరుగుతూనే ఉంటాయి. కవిగా ఆయన రాసిన 'ఎకనామిక్స్ సుందరి' మిక్కిలి ఖ్యాతి పొందింది. 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు, 1987లో మైకేల్ మధుసూధన దత్తు అవార్డు, 1989లో 'మన చేతుల్లోనే వుంది' గ్రంథానికి తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ వచన రచన పురస్కారం, గౌరవ డాక్టరేటులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. అనారోగ్యంతో బాపురెడ్డి ఈ నెల 8న హైదరాబాద్‌లో కన్నుమూసిన బాపురెడ్డికి నివాళులు..
మన కాలం గొప్ప కథకులు భమిడిపాటి
తెలుగు కథానిక స్రష్ట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ కథకునిగా ఖ్యాతినొందిన భమిడిపాటి జగన్నాథరావు (89) ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో కన్ను మూసారు. 1934 డిసెంబర్ 1న కృష్ణాజిల్లా గుడివాడలో పుట్టిన ఆయన నాగపూర్ యూనివర్శిటీ నుంచి ఎం.ఏ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పని చేసారు. 1950 - 60 మధ్య వీరి కథలు పాఠకుల్ని ఉర్రూతలూగించాయి. అడుగుజాడలు, మువ్వలు, పరస్పరం, చూపు, చిత్రనళీయం, అపరంజి పంజరం. అనుతాపం, అనురాగం, చేదునిజం, జాజిపూలు, జీవనరాగం, సముద్రం, లౌక్యుడు, రంగుల కల, వంతెన, వెన్నెల జల్లు, మంటల్లో జాబిల్లి, బొంగరం, బంతి, భావి పౌరులు, పాపం దీక్షితులు, దాహం, జీవితపు విలువలు లాంటి కథలు రాసారు. మానవసంబంధాలు సమాజంలో నీతి, విలువలు ప్రబోధించే ఆయన 3 కథా సంపుటాలను వెలువరించారు. 'భమిడిపాటి జగన్నాథరావు కథలు' యువ కథకులకు స్ఫూర్తినిస్తాయి. తనదైన కథా సాహిత్య ముద్రవేసిన భమిడిపాటికి నివాళులు.
- తంగిరాల చక్రవర్తి