Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలోచనల అంకురం,
సృజనకు వేదికైన మాతృభాష
పరిపూర్ణ మూర్తిమత్వంతో
మిసమిసలాడే అజంతా సుందరి.
ఓ మనిషీ!
శ్వాసలో శ్వాస అయిన
సొంత భాష వైశిష్ట్యాన్ని గుర్తించక,
స్వార్థాల జోలెలు నింపుకుంటూ
కుహనా మేధస్సుకై
వెంపర్లాడే బతుకూ ఒక బతుకేనా?
ఆత్మగౌరవం లేని పయనం
విలువలేని
కాగితపు పువ్వుల హారమేగా!
స్వీయ ప్రతిభను మరచి
పరులకు దాసోహమంటూ
వారి అడుగులకు మడుగులొత్తే
మనిషి మనిషేకాడు,
జీవచ్చవం మాత్రమే
అట్టి వానికి మిగిలేది
చరిత్ర ఛీత్కారమేనని గుర్తెరిగి,
దేశరక్షణ ఎంత గొప్పదో
భాషా పరిరక్షణా
అంతే గొప్పదని తెలుసుకో.
అమ్మభాష
విలువల వలువలు కాపాడు.
(అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా)
- వేమూరి శ్రీనివాస్, 9912128967