Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవులు, కళాకారులు సామాజిక బాధ్యతను తలకెత్తుకుని సామాజిక సమస్యలను కవితలు, కళా రూపాల్లో వ్యక్తం చేస్తుంటారు. అలా సమాజం గజల్ గీతం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తూ కవితలు, గజళ్లు.. రచనలు, గేయాలాపనలతో సమాజాన్ని చైతన్య పరిచారు. తెలంగాణ సాహితిలో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన బైరి ఇందిర.. తాను చూసిన... అనుభవంలోకి వచ్చిన ఉదంతాలకు అక్షర రూపమిచ్చి.... కథానికలుగా తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి గజల్ కవయిత్రిగానూ పేరొందారామె. ఇల్లెందులోని జడ్పీఎస్ఎస్, సుబ్నాగర్ ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా శ్రాస్తీయ ఆలోచనలతో విద్యార్థులను తీర్చిదిద్దారు. ఒక వైపు ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రవృత్తిగా సాహిత్యాన్ని చివరి వరకు సమాజహితానికి అందించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం (19-02-2023)న కన్నుమూశారు.
- 1998లో 'తేనెల పలుకు' కవిత్వానికి ఆస్ట్రేలియా అంతర్జాతీయ అవార్డు.
- 2016లో విజయవాడ మానస సాహిత్య ఆకాడమీ జాతీయ స్థాయి అవార్డు.
- 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అంటేవుర్ రాష్ట్ర స్థాయి సాహిత్య అవార్డు.
- 2013లో కొత్తగూడెం 'చిగురు సాహిత్య అకాడమీ' నానో విభాగంలో అవార్డు.
'అలవోకలు' వచన కవిత్వం, 2007లో, 'అభిమతం' 2016లో 'తెలం గాణ గజల్ కావ్యం' అచ్చయ్యాయి. 2021లో 'అక్షింతలు' మిని కవితలు, 'వలపోత' కథలు, 'మరోప్రారంభం' కవిత్వం పుస్తకాలు వెలువరించారు. 2022 డిసెంబర్లో వురిమళ్ల ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు.