Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖాల మీద
చల్లని నీళ్ళు చిలకరించి
నిద్ర లేపుతుంది
పూల పాదుకు
నీళ్ళు పొస్తూ
పూలకు ఈ సుకుమారమంతా
ఎక్కడి దనుకునేరు?
పొద్దుటి మంచు తెమ్మర
ప్రకృతి చల్లదనం చలువే
మద్యహన్నాలు
ఈ చల్లదనం లభిస్తుందా మీకు ?
లేవండిక లేవండి
ఆరుబయట అలా వ్యాహళ్లికి వెళ్ళి రండి
ఈ పూల బడాయంతా
పొద్దుటి చల్లదనం చలువే
వారసత్వపు నీడే
ప్రకృతి పూల పందిరి అనేది
నాన్నల చమట సౌకర్యాలు
సంజీవినీ అమృతం.
అమ్మల తేనె పలుకులు
ఉరుకులు, పరుగులతో
దార్లన్నీటికి ప్రణమిల్లి రండి మీకు
ఆరోగ్య సౌభాగ్యం .
- హనీఫ్ సయ్యద్