Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెల 17న ప్రముఖ కథా రచయిత డా. సిద్దెంకి యాదగిరి కథా సంపుటి ''మూడు గుడిసెల పల్లె'' పుస్తకావిష్కరణ మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతి మినీ హాల్లో సాయంత్రం 5:30గం.లకు నిర్వహించనున్నారు. మంజీర రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు కె.రంగాచారి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి కొలకలూరి ఇనాక్ పుస్తకావిష్కరణ, విశిష్ట అతిధులుగా ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, నందిని సిద్ధారెడ్డి ముఖ్యఅతిథులుగా, తెలుగు సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు, ప్రముఖ కవి గాయకులు దేశపతి శ్రీనివాస్ వక్తలుగా హాజరు కానున్నారు.