Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రసిద్ధ సమకాలీనాంధ్ర కవుల్లో డా||జె.బాపురెడ్డి గణనీయులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గూడ సుపరిచితులైన వీరు 1936 జులై 21న కరీంనగర్ జిల్లా 'సిరిసిల్ల' తాలుకా పరిధిలోని 'సిరికొండ'లో జంకె కష్ణారెడ్డి, రామలక్ష్మి దంపతులకు జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, గ్రామీణ వాతావరణం లో వేళ్లు తన్నుకున్న వీరి జీవితం, అంచెలంచెలుగా వత్తిరీత్యా ప్రతిష్టాత్మక ఐ.ఏ.ఎస్. ఉన్నతాధికారి స్థాయికి ప్రవత్తిరీత్యా ప్రముఖ కవిగా విజ్ఞాన వేత్తగా ఎదిగిన పరిణామాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. యువతరానికి స్ఫూర్తిదాయకంగా వెలుగొందాయి.
బాపురెడ్డి బహు గ్రంథకర్త. పాఠశాల స్థాయి లోనే కవిత్వ రచన ఆరంభించి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉండగా శోభ పత్రికలో ఎకనా మిక్స్ సుందరి అనే కవితను ప్రచురించి ఉత్తమ కవిత అవార్డును సొంతం చేసుకున్నారు. చైతన్య రేఖలు అనే కవిత్వ సంపుటిని ప్రచురించారు. వీరు రచించిన ఋతురాగం గేయ నాటిక నంది అవార్డును కైవసం చేసుకున్నది. బాపురెడ్డి గేయాలు, శ్రీకారశిఖరం, ప్రేమారామం, నా దేశం నవ్వుతుంది, బాపురెడ్డి భావ గీతాలు, ఆటపాటలు, నవగీత నాట్యం, వంటి గేయ సంపుటాలు, రాకెట్టు రాయబారం, భావి జీవులు, సాగర సౌధం, విజయహేల, కళ్యాణ యాత్ర, చాచా నెహ్రూ, ఎన్జీవో, చేతన కేతనం, స్వాతంత్య్రహేల, సకల జన సంక్రాంతి మొదలైన గేయ నాటికలు, బాపు రెడ్డి పద్య కావ్యాలు, మన చేతుల్లోనే ఉంది, రంగు రంగుల చీకట్లు, ప్రణవ ప్రణయం, కాలం మాయాజాలం, సౌదామిని కవితలు, ఆత్మీయ రాగాలు, అక్షరానుభూతులు, వాడిపోని వసంతాలు, లోకానులోకనం వంటి కవిత్వ సంపుటాలు, ఆధునిక తెలుగు కవిత్వం తీరు తెన్నులు, సాహితీ వైవిధ్యము మొదలైన విమర్శ గ్రంథాలు, అనంత సత్యాలు, నాద వేదాలు, బాపురెడ్డి గద్య కావ్యాలు, పంచ బాణసంచా, వంటి గ్రంథాల తో పాటు నబవర్ quest of harmony, longing for life, Urn of love, loving is living, anatomy of time, varieties and visions వంటి ఆంగ్ల గ్రంథాలు, వ్యవధి లేదు, పైకెత్తాలి, ప్రకతిలో పవిత్రత, అజ్ఞాత శాంతి సందేశం, రాకుమారుడు పగడాల కడలి వంటి అనువాద గ్రంథాలు మొదలైన 50కి పైగా రచనలు చేశారు.
నవ్యత, మానవత, ప్రసన్నత, భావుకత, తాత్వికతలు బాపురెడ్డి కవితల్లో ప్రసాదభరితమై సజీవంగా దర్శనమిస్తాయి. వచన కవిత్వం రాజ్య మేలుతున్న నేటి కాలంలో వీరు సాహసంతో పద్యప్రక్రియను స్పశించి అనుభూతి, అభివ్యక్తి, సౌందర్యం, సందేశం. స్ఫూర్తితో ఛందో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, రసరమ్య భావవాహినులను పొంగించి, తమ పద్యరచనా పటిమను నిరూపించుకున్నారు. వీరి గేయాలు లలిత పద బంధురమై, సురాసుర సంగీత సాహిత్య ప్రియులకు విందు చేశాయి. సుప్రసిద్ధ సంగీత వీరి లలిత గీతాలకు స్వరకల్పన చేసి శ్రోతలనలరించారు.
ఇక వీరి గేయనాటికలు రమణీయ భావ పేటికలు. హద్య కవితావాటికలు. చారిత్రక, పురాణేతిహాస కథాభరితంగా నడుస్తున్న గేయనాటికల ఇతివత్తాలను తమ కలంతో సామాజిక ఇతివత్తాలుగా మార్చి గేయనాటికా రచనల్లో నూతన ఒరవడిని సష్టించారు. వీరి అనువాదాలు అనుభూతి పరాలు, ప్రఖ్యాత పాశ్చాత్య కవయిత్రుల మూడు ఆంగ్లకతుల్ని వీరు తెలుగులోకి అనువదించి మూలకతులలోని కవి హదయాన్ని ఆవిష్కరించారు. తెలుగులో వీరు ఎంత హద యంగమంగా కవితలల్లారో, అంతే హద్యంగా నాలుగు ఆంగ్లకతులను కూడా విర చించి, ఉభయకవి మిత్రులని పించుకున్నారు. వివిధ ధక్కో ణాలతో తన 'మనసులోని మాటలను సామాజిక సాహిత్య వ్యాసాలుగా తీర్చిదిద్ది, వ్యాససంపుటం ద్వారా 'ఆధునిక తెలుగు కవిత తీరుతెన్నులు' తెలుగు వారికందించి విమర్శకునిగా కూడా గుర్తింపు పొందారు. వీరి ప్రతి రచనలోనూ, ప్రణయ, ప్రణవ, ప్రగతి భావాలు, అంతర్వాహినిగా కన్పి స్తాయి. మానవజాతికి నిర్మాణాత్మక శాంతిమయ జీవితదర్శాన్ని అందించే సౌందర్యలహరి ప్రణయం, భౌతిక సత్యాన్ని పరతత్వాన్ని జోడించే పరిమళపోపానమది. ఆయత్నపూర్వక సంవేదనా భివ్యక్తితో మనలను పునీతులగా చేసే తీయని భావమిది. అందుకే ప్రకతి పురుషయోగ తత్వం ప్రతిఫలించే ప్రణయ తత్త్వం మానవ జీవిత సత్యం కావాలని వీరు తమరచనల్లో ఆశించారు. వీరి ప్రగతి భావాలు నిర్మాణాత్మక నిర్ణయాత్మక ఫలితాలను సష్టించాయి. అనంత సత్య గర్భితమైన చరాచర సష్టిలో మానవ జీవితానికి ఉపయుక్తమయ్యే సామాజిక భావోద్దీపన వీరి ప్రగతి తత్త్వంలో దర్శన మిస్తుంది. సామాజిక వైరుధ్యాల పట్ల స్పందన అవశ్యమని తన ప్రగతిశీల భావాల్లో నిరూపిం చారు. తరతరాల ఏకతాభావాన్ని సమతావేదికపై నిలపాలనీ అపుడే సామాజిక అసమానతలు తొలగిపోయి మమతా మానవతలు పరిమళి స్తాయని ప్రగతి దక్పధంతో భావించారు.
బాపురెడ్డి ప్రణవనాదం ఆధ్యాత్మిక, తాత్త్విక భావాలను వినిపించింది. ప్రాపంచిక విషయ సుఖాలలో మునిగిన మనిషి అశాశ్వతమైన కాయమే సత్యమని భ్రమించి జీవితాన్ని వథా చేసుకుంటున్న విషయాన్ని తమ ఆధ్యాత్మక భావా లలో రంగరించిపోశారు. భక్తి, జ్ఞాన, కర్మ యోగ సాధనల ద్వారా అంతులేని ప్రశాం తతను, పవిత్రతను పొంది, ప్రజ్ఞానాన్ని సంపాదించి మోక్షము పొందవచ్చునని రెడ్డి ప్రణవదష్టితో చెప్పారు.
ఇక, వీరి 'భావ భౌతికవాదం' తెలుగులో సరికొత్త స్వేచ్ఛావాదంగా నిలిచి సాహితీ విమర్శకులను సైతం ఆలోచింపజేస్తోంది. భౌతికాన్ని భావంతో సంధానించినప్పుడు అనుభూతమయ్యేది ఆనందమనే అనంతసత్యం. ఒక వస్తువులోని అనంత రూపగుణాలను విశ్వసించడం వల్ల నూతన విలువలు ఏర్పడ తాయి. అవి మన ఆదర్శాలకు అనుగుణంగా ప్రతిఫలించాలని దైవత్వం అనంతత్వాలను ప్రకటితం చేయాలని వీరు తన వాదం ద్వారా అభిలషించారు. అధివాస్త వికతను ఆనందము వైపుమళ్ళించడమూ, సామా జిక స్పహను సౌందర్యం వైపు నడిపించటమూ రెడ్డి భావభౌతికవాద ప్రస్థానం.
బాపురెడ్డి నిరంతరాన్వేషి, కవితా పిపాసి. తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ సాహితీ స్రవంతిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపించారు. అలుపెరుగని కవితా తష్ణతో కడదాకా రచనలు చేసిన బాపురెడ్డి ఇటీవల లోకాన్ని వీడి వెళ్లడం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. తెలుగు సాహితీవినీలాకాశంలో బాపురెడ్డి ఒక ధ్రువతారగా వెలుగుతూనే ఉంటారు.
(వ్యాసకర్త 'బాపురెడ్డి కవితా దక్పథం' పై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టం పొందారు)
- డాక్టర్ చింతోజు మల్లికార్జునాచారి
99499 27142