Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నియంత సమాజ సారధికాదు
సమాజ పీడకుడు హంతకుడు
కుర్చీలు సాధించామని మిడిసిపడినా
మట్టిలో కలిసిండు కానీ
మనసుల్లో నిలిచిపోలేదు
చరిత్రలో పేరుంది కానీ
చరిత్ర సృష్టించలేదు
సమాజ ప్రవాహ నిర్ణేతా కాడు
ఆధిపత్య హింసకు కొత్త మార్గాలు శోధించి
తిరస్కార పురస్కారాలకు పాదులేస్తడు
చరిత్ర అద్దంలా నియంత అంతిమయాత్రను
గుర్తు చేస్తున్నా దాన్ని పట్టించుకోడు
తానే ఏకఛ్ఛత్రాధిపత్యంగా సమాజాన్ని
ఏలుతున్నాననుకుంటడు
నేనే మొదటివాణ్ణి
చివరివాణ్ణి కూడా నేనే అనుకుంటాడు
డప్పు కొట్టి దబాయిస్తడు
చరిత్రలో చీకటి మచ్చగా మిగిలిపోతడు
వెలుగంటే వాడికి భయం
ప్రజా చైతన్యమంటే లోలోపల మరీ భయం
పైకి లెక్కలేనట్లు నటిస్తడు
చరిత్ర తిరగరాసే కుంభకోణముద్రకు
ప్రామాణిక ముద్రవేస్తున్నాననుకుంటడు
కానీ వాడు వేసిన ముద్రలు
ప్రజల చైతన్య ప్రవాహంలో
జాదా జవాబు లేకుండా మునిగిపోతయి
- వల్లభాపురం జనార్దన,
9440163687