Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జరగబోయేది చెప్తావా నువ్వు?
రాబోయే పదేళ్లలో నీ భవిష్యత్తు
ఎలా ఉండబోతోందో చెప్పు
నా భవిష్యత్తు గురించి చెప్పకు
దాన్ని తెలుసుకోవడం
ఇష్టం లేదు నాకు
ఇక్కడ నది ఎకాయెకిన
మలుపు తిరగడం
సంతోషకరంగానే వుంది నాకు
అపరిశుభ్రమైన ఈ గది
పగులువారిన పాత అద్దం
కూడా బాగానే వున్నాయి
ఇక్కడ పచ్చని ఆకులు నాతో
దోబూచులాడి వడలిపోతాయి
భూమిలో, మాలో
యవ్వనం నిండి వుంది
భవిష్యత్కాలపు సమాచారంతో
జ్యోతిషపు లెక్కలతో
మా మీద వల విసరకు
భవిష్యత్తు చీకటిగా వుండనీ
ఫరవా లేదు
ఆంగ్లమూలం : అనీక్ చటర్జీ
అనువాదం : ఎలనాగ