Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా ఊరి పాత చెరువు గట్టు మీద మామిడి చెట్టు
ఉగాది వచ్చిందంటే చాలు, ఊరు ఊరంతా
ఊరపిచ్చుకలై కొమ్మ కొమ్మకు వాలిపోతారు
మామిడాకుల తెంపులాటలు, పిందెలకై పోటీలు,
కాయల కోసం కొట్లాటలు
ఏడాదంతా ఎడారిలా ఒంటరి వేదనతో తను...
ఉగాది రోజు - బిడ్డల చేతిలో దోపిడీకి
గురవుతున్న సంవేదనగా తను...
ఐతే మాత్రం, ఆ రోజంతా తన ఊరితో పండగ సందడే తనకు-
తిరిగి ఏడాదంతా ఒంటరి బతుకు,
ఐనా -
తల్లిలా - పిల్లల గారాబాలు, మారాములు చూసి మళ్ళీ ఉగాది వరకు
సరిపడా ఆత్మీయతను గుండెల్లో నింపుకొని,
వసంతానికై ఆశలను కళ్ళలో ఒంపుకుని
మరో ఏడాది నిరీక్షణ
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్
99088 40186