Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతమైన ఉక్కు పొరల క్రింద
కందక గర్భాల్లో మందపు గొలుసులతో
భద్రంగా ఎప్పట్నుంచో సమాధుల్లో
తాళాలేసి బంధించి దాచి కొన్ని పెట్టెలు!
పిల్లలు వారి ఆటల్లో వాళ్ళు
యవకులు వారి ఆశల్లో వాళ్ళు
ముసలాళ్ళు వాళ్ళ రోగాల్తో వాళ్ళు
మిగతాజనం వాళ్ళ పనుల్తో వాళ్ళు!
నియంతులు నిరంకుశులు
ఉక్కు పొరల్నీ ఒక్కోటొక్కోటీ త్రవ్వేసీ
తాళాల్ని ఒక్కోటొక్కోటిగా బ్రద్దల్జేసీ
పెట్టెలు అమాంతగా తెరిచేస్తే!
యుద్ధోన్మాదం మతోన్మాదం మూఢత్వం
విషవాయువులు జనాల నషనషాలకెక్కు
ఆడా మగా ప్రాంతం దేశం ప్రపంచం
ఉన్మాదుల చేతుల్లో బందీలం కీలుబొమ్మలం!
- రవి కిషోర్ పెంట్రాల, లండన్
0044-07703327908