Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలపిట్ట ఆధ్వర్యంలో అరిశా సత్యనారాయణ - అరిశా ఆదిలక్ష్మిల జ్ఞాపకార్థం కథల పోటీ నిర్వహించనుంది. మొదటి, రెండో, మూడో బహుమతులుగా రూ. 7,000/-, రూ. 5000/-, రూ. 3000/-లతో పాటు ఐదు ప్రత్యేక బహుమతులుగా ఒక్కొక్క కథకు రూ. 1000/- చొప్పున అందివ్వనున్నారు. సొంత కథలకే ప్రాధాన్యమివ్వనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 30లోగా ఎడిటర్, పాలపిట్ట బుక్స్, ఫ్లాట్ నెం. 2, బ్లాక్ నెం. 6, ఎం.ఎల్.జి - 2, ఏపీహెచ్‌బీ, సుందరయ్య పార్క్ ఎదురుగా, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ - 44 చిరునామాకు ఏప్రిల్ 30లోగా పంపవచ్చు. ఫలితాలను 25 మే 2023న ప్రకటించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 9490099327 నంబరు నందు సంప్రదించవచ్చు.